Husbands went to dinner with their wives in the flood waters: భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో పెళ్లిళ్ల నుంచి మొదలుకొని చిన్న చిన్న ఫంక్షన్స్ వరకు పెద్ద ఎత్తున విందు ఏర్పాటు చేస్తుంటారు. ముఖ్యంగా పెళ్లిళ్లలో విందు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా రకాల ఐటమ్స్ వడ్డిస్తుంటారు. పెళ్లి విందు కోసం జనాలు ఎగబడుతుంటారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా.. దాటుకుని మరీ విందు ఆరగిస్తుంటారు. ఇందుకు సంబందించిన వీడియోస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ విందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వైరల్ అవుతున్న వీడియో లో ఓ ఫంక్షన్ హాల్ కనిపిస్తోంది. భారీ వర్షాల కారణంగా ఆ ఫంక్షన్ పరిసరాలు నీరుతో నిండిపోయింది. మోకాలి లోతు నీరు అక్కడ ప్రవహిస్తోంది. వరద నీరు కారణంగా ఫంక్షన్ లోపలి వెళ్లేందుకు వీల్లేకుండా ఉంది. అయినా పెళ్లికి వచ్చిన జనాలు మాత్రం వెనకడుగు వేయలేదు. ఆ నీటిలో నడుచుకుంటూనే.. ఫంక్షన్ హాల్ లోపలికి వెళ్లారు. కొందరు పురుషులు తమ భార్యలను ఎత్తుకుని మరీ లోపలి వెళ్లారు. మరికొందరు తమ పిల్లలు ఎత్తుకుని తీసుకెళ్లగా.. ఇంకొందరు అయితే పాయింట్ విప్పి ఎంచక్కా వెళ్లిపోయారు.
Also Read: Airtel Palns Hike: ఎయిర్‌టెల్ యూజర్లకు మరో షాకింగ్ న్యూస్.. పెరిగిన మూడు ప్లాన్‌ల ధరలు!
ఇందుకు సంబందించిన వీడియోను ఛప్రా జిల్ (छपरा जिल) అనే ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘ఎంత వరద వచ్చినా.. విందు భోజనం మాత్రం మిస్ కాకూడదు. ఈ స్ఫూర్తి ఎప్పటికీ ఇలానే ఉండాలి’ అని ఆ వీడియోకు క్యాప్షన్‌గా ఇచ్చారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దాదాపు 5 లక్షల మంది ఈ వీడియోను వీక్షించగా.. 6 వేల మందికి పైగా లైక్ చేశారు. వీడియో చూసిన వారు కామెంట్ల వర్షం కురిపిస్తన్నారు. ఎంతకు తెగించార్రా, ఇదేందయ్యో ఇది.. ఇది నేనెప్పుడూ చూడలే అంటూ సరదాగా కామెంట్స్ చేశారు. బీహార్ రాష్ట్రంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
भले ही बाढ़ क्यों ना आ जाए पर भोज नहीं छूटना चाहिए, ये जज़्बा कायम रहे 😜😍 pic.twitter.com/Mr5r48L5Dq
— छपरा जिला 🇮🇳 (@ChapraZila) July 10, 2024