92 Years Old Woman Climbe a Gate in China: ప్రస్తుత రోజుల్లో చాలా మందికి సరైన ‘ఫిట్‌నెస్’ లేదనే చెప్పాలి. తినే ఆహరం, జీవన శైలి కారణంగా ఫిట్‌గా ఉండలేకపోతున్నారు. దాంతో ఎక్కువ మంది 2-3 ఫ్లోర్లు ఎక్కితేనే అలసిపోతారు. స్టెప్స్ ఎక్కడానికి ఆపసోపాలు పడుతున్న ఈ రోజుల్లో ఓ 92 ఏళ్ల బామ్మ ఏకంగా భారీ గేటును సునాయాసంగా ఎక్కి పారిపోయింది. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
తూర్పు చైనాలోని షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లోని ఓ నర్సింగ్ హోమ్ నుండి పారిపోవడానికి 92 ఏళ్ల వృద్ధురాలు ప్రయత్నించింది. ఈ క్రమంలో నర్సింగ్ హోమ్ ముందున్న 2.15 మీటర్ల పొడవైన గేటును ఆ బామ్మ సునాయాసంగా ఎక్కింది. అంతే సులభంగా గేటు దిగి పారిపోయింది. ఇందుకు సంబందించిన వీడియో అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ఇది చూసిన నర్సింగ్ హోమ్ సిబ్బంది.. చుట్టుపక్కల ప్రాంతంలో బామ్మని వెతికి పట్టుకున్నారు.
Also Read: Viral Video: ఎంతకు తెగించార్రా.. వరద నీటిలో భార్యలను ఎత్తుకొని మరీ..!
92 ఏళ్ల వృద్ధురాలు భారీ గేటు ఎక్కిన వీడియోను ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వీడియో చూసిన వారు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఈ వీడియోకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. ‘వయస్సు కేవలం ఓ సంఖ్య మాత్రమే’, ‘సూపర్ బామ్మ’, ‘వయసు రీత్యా వృద్ధురాలు కానీ.. మనసు రీత్యా కాదు’అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.