ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026కి సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఐపీఎల్ 2026 వేలం తేదీలు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. వేలం 2025 డిసెంబర్ 13–15 మధ్య తేదీల్లో జరగనుందని సమాచారం. ఫ్రాంచైజీ యజమానులు బీసీసీఐతో చర్చించి.. ఈ తేదీలను సూచించారట. అయితే వేలం తేదీల విషయంకి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌దే తుది నిర్ణయం. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఇంకా అధికారికంగా షెడ్యూల్‌ను ప్రకటించలేదు.
Also Read: IND vs WI: ముగిసిన తొలిరోజు ఆట.. డబుల్ సెంచరీకి చేరువలో యశస్వి!
ఐపీఎల్ 2026 వేలం ఎక్కడ జరుగుతుందో అన్న సమాచారం లేదు. గత రెండు వేలంలు విదేశాలలో జరిగిన విషయం తెలిసిందే. 2023 వేలం దుబాయ్‌లో జరగగా… 2024 వేలం సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగింది. ఈ సారి మాత్రం ఇండియాలో జరిగే అవకాశాలు ఉన్నాయి. మిని వేలం కాబట్టి ముంబైలో జారగనుంది. మరికొన్ని రోజుల్లో దీనిపై ఫుల్ క్లారిటీ రానుంది. ఇక నవంబర్ 15లోగా 10 ప్రాంఛైజీలు తమ రిటెన్షన్ జాబితాను బీసీసీఐకి సమర్పించాల్సి ఉంటుంది. గత సీజన్‌లో అట్టడుగు స్థానాల్లో నిలిచిన మాజీ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లలో భారీ మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. చెన్నై ఐదుగురు ఆటగాళ్లను వదిలేందుకు సిద్ధంగా ఉందట. మిగతా జట్లలో పెద్ద మార్పులు జరిగే అవకాశం లేదు.