Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2025 సంబంధించి ప్రస్తుతం ప్లేఆఫ్స్ సంబంధించి 4 జట్లు ఖరారు అయ్యాయి. ఇకపోతే లీగ్ దశను పూర్తి చేసుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు సభ్యులు తమ ఇళ్లకు చేరుకున్నారు. ఇక ఏ క్రికెట్ అభిమానిని అడిగిన సరే ఈ ఐపీఎల్ లో మర్చిపోలేని బాట్స్మెన్ ఎవరు అంటే వచ్చే కామన్ సమాధానం రాజస్థాన్ రాయల్స్ ప్రామిసింగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ అని. ఎందుకంటే, 14 ఏళ్లున్న ఈ చిచ్చరపిడుగు సృష్టించిన విధ్వసం అలాంటిది మరి. ఇక ఐపీఎల్ లో వారి జట్టు ప్రయాణం ముగియడంతో ఇంటికి తిరిగి వచ్చాడు వైభవ్ సూర్యవంశీ.
ఈ సీజన్లో రాజస్థాన్ 14 లీగ్ మ్యాచ్ లు పూర్తి కావడంతో ఆటగాళ్లు తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో వైభవ్ కు కుటుంబ సభ్యలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాస్ బేబీ వైభవ్ పేరుతో కేక్ కట్ చేయించారు. దీనికి సంబందించిన వీడియోని రాజస్థాన్ రాయల్స్ తమ అఫీషియల్ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. 14 ఏళ్లకే ఐపీఎల్ లోకి అడుగుపెట్టిన వైభవ్ సుర్యవంశీ తన తొలి మ్యాచ్ లోనే విధ్వంసం చూపించాడు.
Read Also: CM Revanth Reddy: మీది 40 ఏళ్ల అనుభవం.. మీరు అండగా ఉంటే అద్భుతాలు చేస్తాం..
ఆ మ్యాచ్ లో 20 బంతులు ఆడిన సూర్యవంశీ 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 34 పరుగులు చేశాడు. ఆ తర్వాత రెండు, మూడు మ్యాచ్ ల్లో తడబడినప్పటికీ గుజరాత్ టైటాన్స్ పై తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 35 బంతుల్లో సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత చెన్నైపై మరో చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ లో వైభవ్ హాఫ్ సెంచరీతో ఆర్ఆర్ ను ఒంటిచేత్తో గెలిపించాడు. కాగా, రాజస్థాన్ మొత్తం 14 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 10 ఓటములతో టోర్నమెంట్‌ను ముగించింది.