BCCI Strict Rule for Foreign Players: ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ పాలసీని బీసీసీఐ ప్రకటించింది. ఆరుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడానికి ప్రతి ప్రాంచైజీకి అవకాశం ఇచ్చింది. ఇందులో ఓ రైట్ టు మ్యాచ్(ఆర్‌టీఎం) ఆప్షన్ ఉంది. టీమ్ పర్స్ వాల్యూను రూ.120 కోట్లకు పెంచింది. అట్టిపెట్టుకున్న ఐదుగురి ఆటగాళ్ల కోసం రూ.75 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. ఈ సీజన్ నుంచి ప్రతి ప్లేయర్ ఆడే మ్యాచ్‌కు రూ.7.50 లక్షల ఫీజు ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. అన్‌క్యాప్డ్ ప్లేయర్ నియమంను బీసీసీఐ మరలా తీసుకొచ్చింది. ఇక విదేశీ ఆటగాళ్ల విషయంలో బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది.
భారత ఆటగాళ్ల కంటే విదేశీ ప్లేయర్స్ ఎక్కువ డబ్బు పొందకుండా బీసీసీఐ ఓ రూల్‌ను కొత్తగా తీసుకొచ్చింది. క్రిక్‌బజ్ ప్రకారం… ఐపీఎల్ 2025లో ఓ భారత ఆటగాడు అత్యధికంగా రూ.18 కోట్లు పలికితే.. ఐపీఎల్ 2026 మినీ వేలంలో విదేశీ ప్లేయర్స్ అంతకంటే ఎక్కువ ధరను సొంతంచేసుకోలేరు. ఒకవేళ ఎక్కువ ధర దక్కించుకున్నా.. రూ.18 కోట్లు మాత్రమే అతడికి దక్కుతాయి. మిగిలిన డబ్బు బీసీసీఐ ఖాతాలోకి చేరుతుంది. ఆ డబ్బును ఆటగాళ్ల సంక్షేమం కోసం బీసీసీఐ ఖర్చు చేయనుంది. ఎక్కువ ధర సొంతం చేసుకునేందుకు కొంతమంది విదేశీ ఆటగాళ్లు మెగా వేలంలో పాల్గొనకుండా.. మినీ వేలంలో బరిలోకి దిగుతున్నారు. గతేడాది మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ రికార్డు ధర పలికిన విషయం తెలిసిందే. అందుకే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read: Galaxy S23 FE Price: 62 శాతం తగ్గింపు.. 30 వేలకే ‘గెలాక్సీ ఎస్23 ఎఫ్‌ఈ’! బ్యాంకు ఆఫర్స్ అదనం
ఉదాహరణకు… ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఓ భారత ఆటగాడు అత్యధికంగా రూ.18 కోట్లు పలికాడు. ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఓ విదేశీ ప్లేయర్ రూ.25 కోట్లు పలికినా.. అతడికి రూ.18 కోట్లు మాత్రమే దక్కుతాయి. మిగిలిన రూ.7 కోట్లు బీసీసీఐ తీసుకొని.. ప్లేయర్స్ సంక్షేమం కోసం ఖర్చు చేస్తుంది. బీసీసీఐ ఈ నిర్ణయంతో ఇకపై విదేశీ ఆటగాళ్లకు భారీ ధర లేనట్టే. ప్రాంచైజీలు కూడా ఎక్కువ పెట్టి కొనేందుకు ఆసక్తి చూపవు.
INDIAN PLAYERS TO DETERMINE FOREIGNERS SALARY IN THE IPL. 🤯
– If the highest bid for an Indian player in 2025 auction is 16cr, then no foreign player can receive more than 16cr in the 2026 auction.
– Similarly, if any Indian goes for over 18cr in this auction, the maximum a…
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 29, 2024