ఐపీఎల్ 17 సీజన్ లో భాగంగా శుక్రవారం నాడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య హోరహోరి మ్యాచ్ జరిగింది. చివరకు లక్నో సూపర్ జెయింట్స్ విజయాన్ని అందుకుంది. లక్నోలోని ఏకనా స్టేడియం వేదికంగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట సీఎస్కే ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది లక్నో సూపర్ జెయింట్స్. దాంతో బ్యాటింగ్ మొదలుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాళ్లు మొదటగా అంతగా రాణించలేదు. చివర్లో రవీంద్ర జడేజా అజయ అర్థ శతకం, అలాగే మహేంద్ర సింగ్ ధోని 9 బంతులలో 28 పరుగులు చేయడంతో 20 ఓవర్లలో సిఎస్కే 6 వికెట్లు నష్టపోయి 176 పరుగులను చేయగలిగింది.
Also read: Elon Musk: భారత పర్యటనను రద్దు చేసుకున్న ఎలాన్ మస్క్..
ఇక లక్ష ఛేదనలో లక్నో బ్యాట్స్మెన్స్ మెరుపు ఇన్నింగ్స్ ని మొదలుపెట్టారు. ఇందులో భాగంగా జట్టు కెప్టెన్ రాహుల్, మరో ఓపెనర్ డికాక్ ఇద్దరు అర్ధ సెంచరీలు చేయడంతో వారి విజయం వైపు బాటలు వేశారు. ఇక చివర్ లో నికలస్ పురాన్, మార్కస్ స్టొయినిస్ కలిసి విజయాన్ని పూర్తి చేశారు. ఈ విషయం ఇలా ఉండగా..
Also read: పెళ్లీడుకొచ్చిన పిల్లలకు తల్లిదండ్రులు చెప్పాల్సిన అసలైన జీవిత పాఠాలు ఇవే..
ఈ మ్యాచ్ లో ఇరు జట్లు స్లో ఓవర్ రేట్ మైంటైన్ చేయడంతో ఐపీఎల్ ప్రకారం నిర్ణిత సమయంలో బౌలింగ్ పూర్తి చేయనందున ఇరుజట్ల కెప్టెన్లకు బిసిసిఐ ఫైన్ వేసింది. ఇద్దరికీ మొదటి తప్పిదం కాబట్టి ఒక్కొక్కరికి రూ. 12 లక్షల జరిమానాను బిసిసిఐ విధించింది. ఇదే తప్పు మరోసారి జరిగినట్లయితే కెప్టెన్ కు 24 లక్షల జరిమానాతో పాటు జట్టులో భాగమైన ఆటగాళ్ల ఫీజులో ఒక్కొక్కరికి 25% కోత, లేకపోతే ఆరు లక్షల రూపాయల ఫైన్ విధించడం జరుగుతుంది. ఇక ఈ సీజన్లో ఇప్పటివరకు రిషభ్ పంత్, శుబ్‌మన్ గిల్, సంజూ సామ్సన్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా జరిమానా బారిన పడగా తాజాగా కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్ కూడా ఈ జాబితాలో చేరారు.