IPhone 14 Series Release Posponed.
గత కొన్ని రోజులుగా ఐఫోన్ 14 సిరీస్ మార్కెట్‌లోకి వచ్చే విషయంలో దోబూచులాడుతోంది. ఇప్పటివరకు ఐఫోన్ 14 సిరీస్ రిలీజ్‌పై అధికారిక ప్రకటన లేకపోయిన త్వరలోనే లాంఛ్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ.. కొన్ని ఐఫోన్ 14 సిరీస్‌లో కొత్త సమస్యలు తలెత్తుతున్నట్లు, అందుకే త్వరలో విడుదల కావాల్సిన ఈ మోడల్ కోసం ఇంకొన్ని వారాల పాటు వేచి చూడాల్సి వస్తోందని చెబుతున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో యాపిల్ ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రొ, ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్ వంటి నాలుగు మోడల్స్‌ను లాంఛ్ చేస్తుండగా తక్కువ ధరలో ప్రొ మోడల్స్ ఫీచర్లను అందించే ఐఫోన్ 14 మ్యాక్స్ కోసం కస్టమర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Health Tips : జుట్టు రాలుతోందా.. బూడిద గుమ్మడి యొక్క ఆరోగ్య ప్రయోజనాలు
మిని మోడల్ స్ధానాన్ని ఐఫోన్ 14 మ్యాక్స్ భర్తీ చేయనుండటంతో ఈ ఏడాది ఐఫోన్ 14 మినీ ఎంట్రీ ఉండదని, ఇక ఐఫోన్ 14 మ్యాక్స్‌కు సప్లయి చైన్ సమస్యలు వెంటాడుతుండటంతో ఈ మోడల్ ప్రొడక్షన్ నెమ్మదించినట్టు టెక్ నిపుణులు రాస్ యంగ్ వెల్లడించారు. దీంతో ఐఫోన్ 14 మ్యాక్స్ రిలీజ్ షెడ్యూల్ కంటే మరికొద్ది వారాలు జాప్యం కావచ్చని సంస్థ ప్రతినిధులు అంటున్నారు.