Edits App: అబ్బురపరిచే ఫీచర్లతో “ఎడిట్స్” యాప్ లాంచ్ చేసిన ఇన్స్టాగ్రామ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Edits App: మెటా కంపెనీకి చెందిన ఇన్స్టాగ్రామ్ తాజాగా మరో కొత్త యాప్ ను లాంచ్ చేసింది. నేడు (ఏప్రిల్ 23) “ఎడిట్స్ (Edits)” అనే కొత్త స్టాండ్ అలోన్ యాప్ ను అధికారికంగా విడుదల చేసింది. వీడియోల క్రియేషన్ సులభతరం చేయడమే ఈ యాప్ ఉద్దేశం. ఇప్పటికే ఈ ఏడాది ప్రారంభంలో ఈ యాప్‌ను ప్రివ్యూ చేశారు. ఇక ఇప్పుడు మాత్రం పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇన్స్టాగ్రామ్ ప్రకారం, వీడియోలు తయారు చేయడం చాలా మందికి కష్టంగా ఉంటుంది. అనేక యాప్‌లు, క్లిష్టమైన వర్క్‌ఫ్లోలు ఉండటం వల్ల క్రియేటర్లకు ఇది తలనొప్పిగా మారుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని, క్రియేటర్లకు ప్రత్యేకంగా “ఎడిట్స్” యాప్‌ను రూపొందించారు. ఇందులో ఉన్న అనేక ఉపయోగకరమైన టూల్స్ సహాయంతో, వీడియో సృష్టి మరింత సులభంగా మారుతుంది.
ఇక ఈ యాప్ లో ప్రధాన ఫీచర్ల విషయానికి వస్తే.. వీడియో రికార్డింగ్, డైరెక్ట్ షేరింగ్/ఎక్స్పోర్ట్, 4K ఎక్స్పోర్ట్ సపోర్ట్, డ్రాఫ్ట్ మేనేజ్మెంట్, ఫ్రేమ్ లెవల్ ఎడిటింగ్, ఫ్రేమ్ లెవల్ ఎడిటింగ్, అడ్వాన్స్ కెమెరా కంట్రోల్స్, AI ఆధారిత ఫీచర్లు, క్రియేటివ్ అసెట్స్, ఆడియో ఎన్హాన్స్మెంట్స్, ఆటో క్యాప్షన్స్, రియల్‌టైమ్ ఇన్సైట్స్, ఆటో క్యాప్షన్స్, రియల్‌టైమ్ ఇన్సైట్స్, కంటెంట్ ట్రాకింగ్ లాంటి అత్యాధునిక ఫీచర్లను అందించనున్నారు. ఇక ఇన్స్టాగ్రామ్ ప్రకారం, యూజర్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ యాప్ నిరంతరం అప్డేట్ అవుతుందని, రాబోయే రోజుల్లో కొన్ని ప్రధాన ఫీచర్లు చేర్చనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కీఫ్రేమ్స్, AI స్టైల్ మాడిఫికేషన్, కో-క్రియేషన్, క్రియేటివ్ టూల్స్ వాటిని అందించనున్నారు. ఎడిట్స్ యాప్ ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ లో డౌన్‌లోడ్‌కు సిద్ధంగా ఉంది. యూజర్లు తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాతో లాగిన్ అయ్యి యాప్‌ను ఉపయోగించవచ్చు. ఇంకెందుకు ఆలస్యం కొత్త “ఎడిట్స్” యాప్ ను డౌన్లోడ్ చేసుకొని మీ క్రియేటివిటీని మరింత అందంగా మార్చండి.
Also Read
- Shreyas Iyer: "ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం".. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
- CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
తాజావార్తలు
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు