అమరావతి ఇన్నర్ రింగు రోడ్డు అలైన్మెంట్ మార్పు కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి ఏపీ హైకోర్టు ఊరట లభించింది. నవంబరు 7వ తారీఖు వరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దని న్యాయస్థానం ఆదేశించింది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రేపు ఉదయం 10 గంటలకు సీఐడీ ఆఫీస్ లో విచారణకు హాజరుకానున్నారు. IRR allignment మార్పు కేసులో లోకేశ్ ను A14గా పేర్కొంటూ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు మెమో ఫైల్ చేశారు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ఎలైన్మెంట్ ఎలా ఉండాలి అనేది నారా లోకేశ్ కనుసన్ననలోనే జరిగింది అని మంత్రి ఆదిమూలపు సురేష్ ఆరోపించారు. నారా లోకేశ్ ఎఫ్ఐఆర్ లో ముద్దాయి.. తప్పు చేశాడు.. అప్పటి సీఎం తనయుడిగా ఆయనకు అన్నీ ముందస్తుగా తెలుసు.. అన్నీ తానై లోకేష్ నడిపించాడు.. హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ గా పలు భూములు కొనుగోలు చేశాడు అంటూ ఆయన అన్నారు.