టెక్నాలజీతో అద్భుతాలు ఆవిష్కృతమవుతున్నాయి. ముఖ్యంగా రవాణా వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా జపాన్ లో ఓ వెహికల్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది రోడ్డుపై బస్సులాగా, రైల్వే ట్రాక్‌లపై రైలులాగా ప్రయాణిస్తుంది. దీనిని డ్యూయల్ మోడ్ వెహికల్ (DMV) అని పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే రెండు మోడ్‌లలో పనిచేయగల మొట్టమొదటి వాహనం. DMV అత్యంత ఆసక్తికరమైన లక్షణాలలో ఒకటి దాని వేగవంతమైన మోడ్ ట్రాన్స్ ఫార్మేషన్. బస్ మోడ్ నుంచి రైలు మోడ్‌కు లేదా రైలు మోడ్ నుంచి బస్సు మోడ్‌కు రూపాంతరం చెందడానికి ఇది కేవలం 15 సెకన్లు మాత్రమే పడుతుంది. అవాకైనన్, కన్నౌరా స్టేషన్లలోని ప్రయాణీకులు ఈ ట్రాన్స్ ఫార్మేషన్ ను తమ కళ్ళతో వీక్షించారు.
Also Read:Weather Report : నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం, ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల ఆందోళన!
ఇది బస్సును పోలి ఉంటుంది. 15 సెకన్లలో, రైలు చక్రాలు తెరుచుకుని పట్టాలపై పరుగెత్తడం ప్రారంభిస్తుంది. ఆ తర్వాత రైల్వే ట్రాక్ ఎండ్ కాగానే బస్ రైర్లు ఓపెన్ అయి రోడ్డుపై దూసుకెళ్తుంది. ఇది ఒకేసారి 21 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదు. పట్టాలపై దీని వేగం గంటకు 60 కి.మీ, రోడ్డుపై గంటకు 100 కి.మీ. ఈ DMV 2021 నుండి పనిచేస్తోంది. జపాన్‌లోని షికోకు ద్వీపంలోని కొచ్చి, తోకుషిమా ప్రిఫెక్చర్ మధ్య నడుస్తుంది. దీనిని ప్రైవేట్ పబ్లిక్ రైల్వే కంపెనీ అయిన ఆసా కోస్ట్ రైల్వే నిర్వహిస్తుంది.