Heart Attack: చిన్నా పెద్ద తేడా లేదు. వయసుతో సంబంధమే లేదు. కొంతకాలంగా గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించే వారి సంఖ్య పెరిగింది. తాజాగా ఓ వ్యక్తి జిమ్ లో ఎక్సర్ సైజ్ చేస్తుండగా.. అకస్మాత్తుగా మరణించాడు. ఈ విషాద ఘటన ఇండోర్‌లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో రెస్టారెంట్ యజమాని ప్రదీప్ రఘువంశీ వర్కవుట్ చేస్తూ అసౌకర్యానికి గురై సెకండ్ల వ్యవధిలోనే కింద పడిపోవడం కనిపిస్తోంది.
Read Also: Temple Collapses: ఉత్తరఖండ్ లో కూలిన ఆలయం.. సురక్షిత ప్రాంతాలకు 60కుటుంబాలు
ఫిట్నెస్ సెంటర్లో చోటుచేసుకున్న ఈ ఘటన అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లోనూ రికార్డైందని పోలీసులు తెలిపారు. రఘువంశీని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా ఆయన మరణించారని వైద్యులు నిర్ధారించారు. వ్యాయామం చేస్తూ పలువురు కుప్పకూలి ప్రాణాలు విడుస్తున్న ఉదంతాలు ఇటీవల వెలుగుచూడటం ఆందోళన రేకెత్తిస్తోంది. గుండె పోటు, సడన్ కార్డియాక్ అరెస్ట్‌తో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Heart-attack से एक और मौत।
वीडियो Indore का बताया जा रहा है। pic.twitter.com/cma5BIx680— Neharika Sharma (@neharikasharmaa) January 5, 2023