Shanti Bhushan: కేంద్ర న్యాయ శాఖ మాజీ మంత్రి శాంతి భూషణ్ కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shanti Bhushan: ప్రముఖ న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి శాంతి భూషణ్ కన్నుమూశారు. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో ఢిల్లీలో శాంతి భూషణ్ తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 97సంవత్సరాలు. అవినీతికి వ్యతిరేకంగా గళం వినిపించిన న్యాయవాదిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఉత్తర ప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో 1925, నవంబర్ 11న ఆయన జన్మించారు. శాంతి భూషణ్ సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పని చేశారు. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. కొంతకాలంగా కాంగ్రెస్ (ఓ)లో పని చేసి, ఆ తర్వాత జనతా పార్టీలో చేరారు. 1974లో నాటి ప్రధాని ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా అలహాబాద్ హైకోర్టులో వాదనలు వినిపించిన న్యాయవాదిగా వార్తల్లో ప్రముఖంగా నిలిచారు.
Read Also:CS Shanti Kumari : కొత్త సచివాలయంలో భద్రతపై సీఎల్ శాంతి కుమారి సమీక్ష
Also Read
- Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
- Muhammad Yunus: "నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు".. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
- Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
1977 నుంచి 1980 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్న సమయంలో 1977-1979 వరకు కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పని చేశారు. 1980లో ‘సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. దీని ద్వారా సుప్రీంకోర్టులో ఎన్నో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. 2018లో కూడా ‘మాస్టర్ ఆఫ్ రోస్టర్’పై సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. స్వాతంత్ర సమరయోధుడు రాజ్ నారాయణ్ తరఫున ఒక కేసు వాదించారు. ఈ కేసు 1974లో ఇందిరా గాంధీ ప్రధానిగా తొలగింపునకు కారణమైంది. 44వ రాజ్యాంగ సవరణలోనూ ఆయన ముఖ్య పాత్ర పోషించారు. 1980లో బీజేపీలో చేరారు. అయితే, 1986లో తన నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ వ్యవహరించినందుకుగాను ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన తనయుడు ప్రశాంత్ భూషణ్ కూడా ప్రముఖ న్యాయవాది.
తాజావార్తలు
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Muhammad Yunus: “నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు”.. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
-
Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
-
Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
-
Buddha Prasad: జనసేన లేకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు!
ట్రెండింగ్
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!