దేశంలో ఇప్పటికే పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. దసరా, దీపావళి బొనాంజా తర్వాత వ్యాపారులకు భారీ బొనాంజా తగలనుంది. దేశంలో ఈ నెల 4న మొదలైన పెళ్లిళ్ల సీజన్ వచ్చే నెల 14 వరకు కొనసాగుతుందని, ఈ సీజన్‌లో మొత్తంగా 32 లక్షల వివాహాలు జరిగే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) వెల్లడించింది.