గత కొన్నేళ్లుగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక భారత్ చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపింది. రెండు సంవత్సరాల క్లిష్టతరమైన ఆర్థిక సంక్షోభం నుంచి శ్రీలంక కోలుకున్నదని, భారతదేశం నుంచి అందుకున్న 3.5 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం వల్ల ఇది సాధ్యమైందని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే శనివారం అన్నారు.
రోజు రోజుకు భారత రూపాయి పడిపోతుంది. దీంతో ఇప్పటికే అమెరికాన్ డాలర్ తో పోల్చితే ఇండియన్ రూపీ భారీగా పతనమైంది. అయితే.. అమెరికా డాలర్‌తో సమానంగా భారత్ రూపాయిని ఉపయోగించాలని తమ దేశం కోరుకుంటోందని శ్రీలంక ప్రెసిడెంట్ రణిల్ విక్రమసింఘే తెలిపారు. శ్రీలంక ఇండియన్ సీఈవో ఫోరమ్‌లో పాల్గొన్న ఆయన.. ఈ కామెంట్స్ చేశారు.
శ్రీలంకలో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారాయి. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం వదిలి పారిపోవడంతో ఒక్కసారిగా ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు కట్టలు తెంచుకున్నాయి. ఒక్కసారిగా జనాలు వీధుల్లోకి వచ్చారు. రాజధాని కొలంబో ప్రజల ఆందోళనలతో దద్దరిల్లిపోతోంది. ఏకంగా ప్రధాని రణిల్ విక్రమ సింఘే నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు ఆందోళనకారులు. ప్రధాని నివాసానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో భద్రతా బలగాలకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. టియర్ గ్యాస్ తో జనాలను చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి…