పోర్ట్స్ మౌత్‌లోని అరుండెల్ మైదానంలో టీమిండియా ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. నెట్ ప్రాక్టీస్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌పైనే కాకుండా ఫీల్డింగ్‌పై కూడా రోహిత్ సేన నజర్ పెట్టింది. ఈ క్రమంలో రంగు రంగుల రబ్బరు బంతులతో భారత జట్టు క్యాచింగ్ ప్రాక్టీస్ చేస్తోంది.