అమెరికా (America)లో భారతీయుల వరుస హత్యలతో కలవరం రేపుతోంది. ఇప్పటికే ఆరుగురు భారతీయులు హత్యకు గురికాగా.. తాజాగా మరో భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు.
అమెరికాలోని అలబామాలో గది అద్దె విషయంలో జరిగిన గొడవలో భారతీయ సంతతికి చెందిన మోటెల్ యజమాని ప్రవీణ్ రావోజీభాయ్ పటేల్ (76) హత్యకు గురయ్యాడు. ఒక కస్టమర్ తుపాకీతో కాల్చి చంపాడు. నిందితుడు 34 ఏళ్ల విలియం జెరెమీ మూర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
విలియం జెరెమీ మూర్.. మోటెల్‌లో ఒక గదిని అద్దెకు తీసుకోవాలనుకున్నాడు. కాని వెంటనే పటేల్‌తో వాగ్వాదం జరిగింది. అనంతరం.. మూర్ చేతి తుపాకీని తీసి వృద్ధుడిని కాల్చి చంపాడు. నిందితుడు సమీపంలోని పాడుబడిన ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించినప్పుడు అప్రమత్తమైన పోలీసులు కొద్దిసేపటికే మూర్‌ను అరెస్టు చేశారు.