సోంపు గింజల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మన వంటగదిలో ఉండే పోపుల పెట్టేలో ఉండే వాటిలో ఇవి కూడా ఉంటాయి.. చాలా మంది భోజనం చేసిన తర్వాత సోంపును తింటారు. సోంపు గింజలను తినడం వల్ల నోరు శుభ్రపడుతుందని చాలా మంది ఇలా చేస్తుంటారు.. వీటితో సువాసన మాత్రమే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి తెలుసుకుందాం..
సోంపు గింజల నీరు తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. భోజనం చేసిన తరువాత వచ్చే అసౌకర్యాన్ని తగ్గించడంలో సోంపు గింజల నీరు మనకు ఎంతగానో సహాయపడుతుంది.. అలాగే కడుపులో మంట, గ్యాస్ వంటి సమస్యలు దూరం అవుతాయి.. ఈ నీటిలో తక్కువ క్యాలరీలు ఉంటాయి.. వీటిని తాగడం వల్ల ఆకలి వెయ్యదు..బరువు తగ్గాలనుకునే వారు సోంపు గింజల నీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ నీటిలో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి..
అంతేకాదు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.. నోటి దుర్వాసన తగ్గుతుంది.. అలాగే మొటిమలు, మచ్చలు వంటి చర్మ సమస్యలు తగ్గడంతో పాటు వృద్దాప్య ఛాయలు ఏర్పడకుండా చేస్తుంది.. ఇక మహిళలకు మంచి మెడిసిన్… నెలసరి సమయంలో వచ్చే ఇబ్బందులను తగ్గించడంలో సోంపు నీళ్లు చక్కగా పనిచేస్తాయి.. అలాగే ఇంకా ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు అని నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.