Night Time Temperatures: రోజు రోజుకు పెరిగిపోతున్న కాంక్రీటీకరణ, గాలిలో తేమ స్థాయులు దేశంలోని మహానగరాల్లో వేడిని పెంచేస్తున్నాయి. గత దశాబ్ద క్రితంనాటితో పోలిస్తే ఇప్పుడు రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవుతున్నాయన ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్’ (సీఎస్‌ఈ) నివేదికలో వెల్లడించింది. జనవరి 2001 నుంచి ఏప్రిల్ 2024 వరకు దేశంలోని ప్రధానమైన ఆరు మహా నగరాలు- ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో వేసవి తీవ్రతను ఇందులో విశ్లేషించింది. గాలివేడి, భూమి ఉపరితల ఉష్ణోగ్రత, గాలిలో తేమకు సంబంధించిన అంశాలను పరిగణనలో తీసుకుంది.
Read Also: Naga Vamsi : జూన్ 10 న బాలయ్య ఫ్యాన్స్ కు పూనకాలే..
అయితే, పెరిగిన తేమ.. అన్ని వాతావరణ జోన్లలో వేడిని మరింత తీవ్రతరం చేస్తోంది అని సీఎస్ఈ పేర్కొనింది. ఢిల్లీ, హైదరాబాద్‌లలో ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గడానికి కూడా ఛాన్స్ లేదని చెప్పుకొచ్చింది. బెంగళూరు మినహా మిగిలిన ఐదు మహా నగరాల్లో 2001-10 సగటుతో పోలిస్తే 2014-2023 మధ్య వేసవికాల తేమ సగటున 5 నుంచి 10 శాతం పెరిగిందని సూచించింది. 2001-10 మధ్య ఉష్ణోగ్రతలు రాత్రిపూట 6.20 – 13.20 డిగ్రీల సెల్సియస్ మేర తగ్గేవని.. కానీ, 2014 నుంచి 2023 మధ్య 6. 20-11.50 డిగ్రీలు మాత్రమే తగ్గింది అని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ నివేదికలో వెల్లడించింది.
Read Also: Sunrisers Hyderabad: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఎన్నెన్నో రికార్డులు సొంతం!
కాగా, పగటి ఉష్ణోగ్రతల మాదిరే వేడిరాత్రులు ప్రమాదకరమైనవి అంటూ సీఎస్ఈ చెప్పుకొచ్చింది. ఆరు నగరాల్లో రుతుపవనాల కాలాలు గతంలో కంటే వేడిగా ఉంటున్నాయని పేర్కొనింది. పట్టణేతర ప్రాంతాలతో పోలిస్తే 140కి పైగా నగరాలు దాదాపు 60 శాతం కంటే ఎక్కువగా రాత్రిపూట వేడిని ఎదుర్కొంటున్నాయని తాజా పరిశోధనలో తెలింది. కాంక్రీటు, తారు కలిగిన ఉపరితలాలు పగటిపూట వేడిని నిల్వ చేసుకొని సాయంత్రం రిలీజ్ చేస్తాయిన నివేదించింది. దీంతో రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దేశంలోని ఇతర ప్రాంతాల కంటే వాయవ్య, ఈశాన్య, దక్షిణ ప్రాంతాల్లోని నగరాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతల్లో పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది వెల్లడించింది. దేశం మొత్తంరెట్టింపు స్థాయిలో నగరాలు వేడెక్కుతున్నాయన్నారు.