రోజు రోజుకు పెరిగిపోతున్న కాంక్రీటీకరణ, గాలిలో తేమ స్థాయులు దేశంలోని మహానగరాల్లో వేడిని పెంచేస్తున్నాయి. గత దశాబ్ద క్రితంనాటితో పోలిస్తే ఇప్పుడు రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవుతున్నాయన ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్’ (సీఎస్‌ఈ) నివేదికలో వెల్లడించింది.
రెండు దశాబ్దాల తర్వాత అరుదైన సూర్యగ్రహణం ఇవాళ ఏర్పడనుండగా.. కేతుగ్రస్త సూర్య గ్రహణం కావటం విశేషంగా చెబుతున్నారు.. అంటే సహజంగా రాహుకేతువుల ప్రభావంతో ఏర్పడే గ్రహణాలలో రాహు ప్రభావంతో ఏర్పడే దానిని రాహుగ్రస్తమని, కేతుగణ ప్రభావంతో ఏర్పడే దానిని కేతుగ్రస్తమని అంటారు. అయితే, కేతుగ్రస్త సూ ర్యగ్రహణం చాలా అరుదుగా ఏర్పడుతుంది. దాదాపు 22 సంవత్సరాల తర్వాత ఇటువంటి సూర్యగ్రహణం ఏర్పడుతుంది.. ఈసారి కేతుగ్రస్త సూర్యగ్రహణం స్వాతి నక్షత్రంలో ఏర్పడుతోన్న నేపథ్యంలో.. ఆ నక్షత్రంలో జన్మించిన వారు,…
ఖగోళంలో మరో అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది.. 22 ఏళ్ల తర్వాత ఇవాళ అరుదైన దృశ్యం చూసే అవకాశం దక్కింది.. 2022వ సంవత్సరంలో రెండో సారి మరియు చివరి సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ సారి దీపావళి వేడుకలు జరుపుకుంటున్న నేపథ్యంలో గ్రహణం ఏర్పడటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సారి పాక్షిక సూర్యగ్రహణం ప్రభావం గంటా 45 నిమిషాల పాటు ఉంటుందని పండితులు చెబుతున్నమాట… ఇవాళ ఏర్పడే సూర్యగ్రహణం ఐరోపా, ఈశాన్య ఆఫ్రికా మరియు పశ్చిమాసియాలోని వివిధ ప్రాంతాల్లో దర్శనమిస్తుంది..…
కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో.. విధించిన లాక్‌డౌన్‌లు, ఆంక్షలతో ఎన్నడూ లేని విధంగా కాలుష్యం తగ్గిపోయినట్టు గణాంకాలు వెల్లడించాయి.. మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.. దీంతో.. దేశంలో కాలుష్య పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని సహా ఉత్తర భారతంలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంకటోంది. వరుసగా నాలుగో ఏడాది ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన రాజధానిగా ఢిల్లీ ప్రథమ స్థానంలో ఉంది. ఇక, గాలి నాణ్యత ప్రమాదకరంగా ఉన్న తొలి 50 నగరాల్లో 35…