రోజు రోజుకు పెరిగిపోతున్న కాంక్రీటీకరణ, గాలిలో తేమ స్థాయులు దేశంలోని మహానగరాల్లో వేడిని పెంచేస్తున్నాయి. గత దశాబ్ద క్రితంనాటితో పోలిస్తే ఇప్పుడు రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవుతున్నాయన ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్’ (సీఎస్‌ఈ) నివేదికలో వెల్లడించింది.
పర్యావరణ పరిరక్షణ కోసం తెలంగాణ చేస్తున్న కృషికి మరో జాతీయ గుర్తింపు దక్కింది. అటవీ విస్తీర్ణాన్ని పెంచడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ తన ‘ది స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్‌మెంట్ 2023: ఇన్ ఫిగర్స్’ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.