World Chess Champion Gukesh: భారత యువ స్టార్ డి. గుకేష్ చెస్ ప్రపంచానికి కొత్త ఛాంపియన్‌గా అవతరించాడు. సింగపూర్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను ఓడించి గుకేశ్ టైటిల్ గెలుచుకున్నాడు. ఈ విజయం గుకేశ్‌ను చెస్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ ఛాంపియన్‌గా నిలిపింది. డిసెంబర్ 12, గురువారం ఛాంపియన్‌షిప్‌లోని 14వ రౌండ్ లేదా చివరి రౌండ్‌లో గట్టి పోటీ నెలకొంది. ఈ సమయంలో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన డింగ్ లిరెన్ చిన్న పొరపాటు చేశాడు. ఆ పొరపాటు అతనికి భారీ నష్టాన్ని కలిగింది. దీంతో అవకాశాన్ని అందిపుచ్చుకున్న గుకేశ్ కేవలం 18 ఏళ్ల వయసులోనే ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించి రికార్డు సృష్టించాడు. మొత్తానికి గుకేశ్ ఈ విజయంతో 18వ ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచాడు.
Also Read: Car Price Hike Alert: కారు కొందామనుకుంటున్నారా? అయితే వెంటనే కొనండి.. ఆలస్యమైతే ఇక బాదుడే
THE EMOTIONS…!!! 🥹❤️
– 18 Year Old Gukesh Dommaraju creating history by becoming the youngest ever champion. 🇮🇳 pic.twitter.com/LVkA8JMKM1
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 12, 2024
సింగపూర్‌లో జరిగిన ఈ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో చైనా ఆటగాడు డింగ్ లిరెన్, భారత ఆటగాడు డి. గుకేశ్ మధ్య గట్టి పోటీ జరిగింది. డింగ్ లిరెన్ గత సంవత్సరం ఈ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాడు. కాబట్టి ఆయన డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఈసారి పోటీలో పాల్గొన్నాడు. మరోవైపు, గుకేశ్ ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన క్యాండిడేట్స్ టోర్నమెంట్‌లో విజయం సాధించడంతో ఈ ఛాంపియన్‌షిప్‌లో ఛాలెంజర్‌గా ప్రవేశించాడు. ఇకపోతే గుకేశ్, విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు చేరుకున్న రెండవ భారతీయుడిగా.. అలాగే ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన చెస్ ఛాంపియన్‌గా ఈ ఘనత సాధించాడు.
Also Read: Tata Motors: మారుతీ సుజుకీ, హ్యుందాయ్ దారిలో టాటా మోటార్స్.. జనవరి నుంచి ధరలు పెంపు..