Car Price Hike Alert: 2024 ఏడాది ముగియబోతోంది. కొత్త సంవత్సరం 2025 రాబోతుంది. దింతో ప్రస్తుతం వివిధ ఆటో దిగ్గజ కంపెనీలు భారీగా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అయితే, సంవత్సరం మారుతున్న నేపథ్యంలో దాదాపు అన్ని ఆటో దిగ్గజ సంస్థలు వారి వాహనాల ధరలను అమాంతం పెంచేందుకు రెడీ అయిపోయాయి. ప్రస్తుతం డిసెంబర్ నెల కాబట్టి వివిధ కంపెనీలు భారీ ఆఫర్లతో ప్రజలను ఆకర్షిస్తున్నాయి. మరి ఏఏ కంపెనీలు వారి వాహన ధరలను ఏమాత్రం పెంచబోతున్నాయో ఒక లుక్ వేద్దాం..
Also Read: Toyota Camry: స్టైలిష్ లుక్, అబ్బురపరిచే ఫీచర్లతో మార్కెట్లో విడుదలైన టయోటా క్యామ్రీ
ఇందులో మొదటగా టాటా మోటార్స్ కార్లను తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు ఇదే సరైన సమయం. ఎందుకంటే, టాటా మోటార్స్ తన వాహనాల ధరలను జనవరి 2025 నుండి అప్‌డేట్ చేయనున్నట్లు ప్రకటించింది. అంటే డిసెంబర్ 31 వరకు మాత్రమే మీరు ప్రస్తుత ధరకే కార్లను కొనుగోలు చేయగలుగుతారు. పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ వంటి అన్ని రకాల వాహనాలపై ఈ ధరల పెంపు వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. నిరంతరం పెరుగుతున్న ఖర్చులు, ఖరీదైన లాజిస్టిక్స్ ఇంకా ద్రవ్యోల్బణం పరిస్థుతుల కారణంగా వాహనాల ధరలు పెంచుతున్నట్లు టాటా మోటార్స్ పేర్కొంది. అన్ని వాహనాల ఎక్స్-షోరూమ్ ధరను దాదాపు 3 శాతం పెంచనున్నట్లు కంపెనీ తన ప్రకటనలో తెలియచేసింది. అయితే, ఏ మోడల్ ధర ఎంత పెరుగుతుందనేది మాత్రం కంపెనీ పూర్తిగా వెల్లడించలేదు. ఇది వివిధ మోడల్స్, వేరియంట్‌లపై ఆధారపడి ఉంటుంది.
Also Read: Bombay High Court: బిడ్డని తల్లి నుంచి దూరం చేయడం క్రూరత్వమే..
టాటా మోటార్స్‌తో పాటు, మారుతీ సుజుకీ, హ్యుందాయ్, కియా, ఎమ్‌జి మోటార్స్, మహీంద్రా కూడా జనవరి నుండి తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. మారుతీ సుజుకీ తన కార్ల ధరలను 4% పెంచుతున్నట్లు ప్రకటించింది. హ్యుందాయ్ కార్ల ధరలను రూ.25,000 మేర పెంచనున్నట్లు సమాచారం. అలాగే, MG మోటార్ తన కార్ల ధరలను 3% మేర పెంచుతుందని తెలుస్తోంది. కియా ఇండియా 2% పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఇక మరోవైపు, ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో టాటా మోటార్స్ అగ్రగామిగా దూసుకెళ్తుంది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో టియాగో EV, టిగోర్ EV, Nexon EV, పంచ్ EV, కర్వ్ EV వంటి అనేక ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. ఈ అన్ని కార్ల ధరలు కూడా భారీగా పెరగనున్నాయి. గత నెలలో టాటా మోటార్స్ కార్ల అమ్మకాలలో 2 శాతం స్వల్ప వృద్ధిని నమోదు చేసింది. ఈ నెలలో కంపెనీ 47 వేలకు పైగా యూనిట్లను అమ్మింది.