Indian2 OTT: కమల్ హాసన్, శంకర్ ల మరోసారి కలియకలో ఇండియన్ 2 జూలై 12, 2024న థియేటర్లలోకి వచ్చేసింది. ఈ సినిమా తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. ఒక మంచి కోలీవుడ్ చిత్రం విడుదలై కొంతకాలం గడిచింది. ఇక నేడు విడుదలైన ఇండియన్ 2 బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన చూపించబోనుంది. ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, ఎస్‌జె సూర్య, బాబీ సింహా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చారు. సోనీ మ్యూజిక్ మూవీ ఆడియో హక్కులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
Virat Kohli-BCCI: విరాట్ కోహ్లీకి ఆ విషయాన్ని బీసీసీఐ చెప్పలేదట!
27 ఏళ్ల కిందట 1996లో వచ్చిన భారతీయుడు సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇక ఇప్పుడు ఇండియన్ 2 మూవీని మరింత భారీగా నిర్మించారు. ఇక నేడు విడుదలైన సినిమాపై ప్రెకషకులనుండి ఎక్కువుగా పాజిటివ్ టాక్ వినిపిస్తున్న., అక్కడక్కడా నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. చూడాలి మరి మొదటిరోజు పూర్తి అయ్యేసరికి సినీ అభిమానులు ఎటు వైపు తీర్మానము ఇస్తారో. ఇకపోతే తాజాగా ఈ సినిమా ఓటీటీ వివరాలు బయటకు వచ్చాయి. ఇండియన్ 2 సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. తమిళం తోపాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఇండియన్ 2 స్ట్రీమింగ్ కానుంది. ఇక సినిమా స్ట్రీమింగ్ డేట్ సంబంధించి ఎటువంటి వివరాలు తెలియరాలేదు.
9th Class Girl Murder: ముచ్చుమర్రిలో ఇంకా దొరకని 9వ తరగతి బాలిక మృతదేహం..
ఇక నేడు విడుదల అయిన ఈ సినిమాలో అనుకనట్లుగానే సినిమా చివరిలో మరో 6 నెలలో విడుదల కాబోతున్న ఇండియన్ 3 సినిమా ట్రైలర్ ను ప్రదర్శించారు. ఈ ట్రైలర్ లో నటుడు కమల్ హాసన్ కొత్త అవతారం లో కనపడ్డాడు.
#indian3 trailer pic.twitter.com/8rPgFYTtlp
— kittu (@krthkdotk) July 12, 2024