భారతదేశం, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత తారాస్థాయికి చేరుకుంది. గురువారం రాత్రి పాకిస్థాన్ జమ్మూ, జైసల్మేర్, పఠాన్‌కోట్ సహా అనేక నగరాలపై క్షిపణులతో దాడి చేసింది. అయితే.. భారతదేశ వాయు రక్షణ వ్యవస్థ S-400 క్షిపణులను గాల్లోనే కూల్చివేసి దాడిని అడ్డుకుంది. అలాగే.. పాకిస్థాన్ ఎఫ్-16 ఫైటర్ జెట్‌ను భారత్ కూల్చివేసింది. జమ్మూ, పఠాన్‌కోట్, షాపూర్, మాధోపూర్, ఫిరోజ్‌పూర్, జైసల్మేర్‌లో పాకిస్థాన్ క్షిపణులు, డ్రోన్‌లను ప్రయోగించింది. దాడి జరిగిన వెంటనే, జమ్మూతో సహా అన్ని ప్రాంతాలలో సైరన్లు మోగడం ప్రారంభించాయి. దీని కారణంగా ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే ఆ ప్రాంతమంతా కరెంట్ తొలగించారు.
READ MORE: Rama Charan: ‘జగదేక వీరుడు’కి నాగ్ అశ్విన్ సీక్వెల్ చేయాలి.. రామ్ చరణ్ డిమాండ్
పాక్ దాడి తర్వాత.. భారత యుద్ధ విమానాలు జమ్మూ విమానాశ్రయం నుంచి బయలుదేరాయి. జమ్మూ విశ్వవిద్యాలయం సమీపంలో రెండు డ్రోన్లను కూల్చివేశాయి. ఆర్ఎస్ పురా, అర్నియా, సాంబాలలో పాకిస్థానీ క్షిపణులను యాంటీ-డ్రోన్ వ్యవస్థలు కూల్చివేశాయి. దీనితో పాటు, పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడిని కూడా భారతదేశం భగ్నం చేసింది. ఇక్కడ కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పేలుళ్ల శబ్దం విన్న వెంటనే దుకాణదారులు, ప్రజలు తమ ఇళ్ల వైపు పరిగెత్తారు. కొంతమంది పేలుళ్లకు ముందు ఆకాశంలో ఎర్రటి లైట్లు, కాంతిని చూశారు. ఈ దాడికి సంబంధించి ఫోటోలు, వీడియోలను ఒక ఎక్స్ యూజర్ షేర్ చేస్తూ.. “జమ్మూలోని మా ఇళ్లపై క్షిపణులు ఎగురుతున్నాయి. ఇది పుకారు కాదు, నేనే స్వయంగా చూస్తున్నాను. రికార్డ్ చేస్తున్నాను” అని రాశారు. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వీడియోలు వైరల్‌గా మారాయి. కాగా.. జమ్మూ ప్రాంతంలో పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చివేసేందుకు భారతదేశం తన అధునాతన వాయు రక్షణ వ్యవస్థను ఉపయోగించింది.
READ MORE: Rajinikanth : రజినీకాంత్ రికార్డు రెమ్యునరేషన్.. ఇండియాలో ఇదే అత్యధికం..