Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఈ వయసులో కూడా కుర్ర హీరోలతో పోటీ పడుతున్నాడు. భారీ యాక్షన్ సినిమాలు చేస్తూ వందల కోట్ల బిజినెస్ చేసుకుంటున్నాడు తన మూవీలకు. మూడు జనరేషన్లలో ఆయనకు భారీ ఫాలోయింగ్ ఉంది. అందుకే సినిమాల రెమ్యునరేషన్ పరంగా కూడా రికార్డులు కొల్లగొడుతున్నాడు. రెమ్యునరేషన్ విషయం వచ్చినప్పుడల్లా ఇండియాలో రజినీ కాంత్ పేరు మార్మోగిపోతుంది. తాజాగా మరోసారి నేషనల్ వైడ్ గా రికార్డు సృష్టించాడు. లోకేష్ డైరెక్షన్ లో కూలీ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ కోసం భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడంట.
Read Also : Shailesh : నా కొడుకు వెంకటేశ్వర స్వామితో మాట్లాడాడు : డైరెక్టర్ శైలేష్
ఏకంగా రూ.260 కోట్ల నుంచి రూ.280 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని పింక్ విల్లా పేర్కొంది. ఈ భారీ రెమ్యునరేషన్ తో ఇండియాలోనే అత్యధికంగా తీసుకుంటున్న హీరోగా రజినీ రికార్డు సృష్టించినట్టు పేర్కొంది. ఈ విషయం ఇప్పుడు రజినీ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేస్తోంది. దీని తర్వాత చేస్తున్న జైలర్-2 సినిమా కోసం కూడా భారీగానే తీసుకుంటున్నాడు రజినీ కాంత్. ఆ మూవీకి ఎంత లేదన్నా రూ.250 కోట్లకు పైగానే తీసుకుంటున్నాడంట. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also : CM Revanth Reddy: ఉగ్రవాదులను ఏరివేయండి.. మా మద్దతు ఉంటుంది..!