Big News : జమ్మూకశ్మీర్ ప్రజలు మరోసారి భయభ్రాంతులకు లోనయ్యారు. గురువారం సాయంత్రం జమ్మూ నగరంలోని విమానాశ్రయం (Jammu Airport) సహా ఏడు ప్రధాన ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలతో నగరంలో ఒక్కసారిగా ఆందోళన ఏర్పడింది. వెంటనే భద్రతా బలగాలు అప్రమత్తమై, సమగ్ర గాలింపు చర్యలు ప్రారంభించాయి. తాత్కాలికంగా నగరాన్ని బ్లాక్ అవుట్ చేయగా, ప్రజలకు ఇంట్లోనే ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. తాజా సమాచారం ప్రకారం, జమ్మూ నగరంపై విధించిన బ్లాక్ అవుట్…
భారతదేశం, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత తారాస్థాయికి చేరుకుంది. గురువారం రాత్రి పాకిస్థాన్ జమ్మూ, జైసల్మేర్, పఠాన్‌కోట్ సహా అనేక నగరాలపై క్షిపణులతో దాడి చేసింది. అయితే.. భారతదేశ వాయు రక్షణ వ్యవస్థ S-400 క్షిపణులను గాల్లోనే కూల్చివేసి దాడిని అడ్డుకుంది. అలాగే.. పాకిస్థాన్ ఎఫ్-16 ఫైటర్ జెట్‌ను భారత్ కూల్చివేసింది. జమ్మూ, పఠాన్‌కోట్, షాపూర్, మాధోపూర్, ఫిరోజ్‌పూర్, జైసల్మేర్‌లో పాకిస్థాన్ క్షిపణులు, డ్రోన్‌లను ప్రయోగించింది.