దేశ రాజధాని ఢిల్లీలో కూడా మరి కాసేపట్లో ఎయిర్ రైడ్స్ సైరన్ల రిహార్సల్స్ చేస్తున్నారు. డైరక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ ఆధ్వర్యంలో సైరన్ రిహార్సల్స్ చేయనున్నారు. వైమానిక దాడుల సందర్భంగా ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఈ సైరన్లు మోగనున్నాయి.
భారతదేశం, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత తారాస్థాయికి చేరుకుంది. గురువారం రాత్రి పాకిస్థాన్ జమ్మూ, జైసల్మేర్, పఠాన్‌కోట్ సహా అనేక నగరాలపై క్షిపణులతో దాడి చేసింది. అయితే.. భారతదేశ వాయు రక్షణ వ్యవస్థ S-400 క్షిపణులను గాల్లోనే కూల్చివేసి దాడిని అడ్డుకుంది. అలాగే.. పాకిస్థాన్ ఎఫ్-16 ఫైటర్ జెట్‌ను భారత్ కూల్చివేసింది. జమ్మూ, పఠాన్‌కోట్, షాపూర్, మాధోపూర్, ఫిరోజ్‌పూర్, జైసల్మేర్‌లో పాకిస్థాన్ క్షిపణులు, డ్రోన్‌లను ప్రయోగించింది.
జమ్మూలో ఈరోజు భారతదేశంపై పాకిస్థాన్ దాడి చేసింది. విమానాశ్రయం సమీపంలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. జమ్మూ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకునేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోంది. దీని తరువాత ఎయిర్ సైరన్లు మోగాయి. జమ్మూ అంతటా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రజలు తమ ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. జమ్మూలోని వివిధ ప్రాంతాల్లో బ్లాక్‌అవుట్ విధించారు. జమ్మూలో 5-6 పేలుళ్ల శబ్దాలు వినిపించాయని చెబుతున్నారు. పాకిస్థాన్ డ్రోన్లు భారతదేశంలోకి ప్రవేశిస్తున్నట్లు కనిపించాయి. పాకిస్థాన్ దుందుడుకు చర్యలకు భారత సైన్యం…
పౌర రక్షణ బాధ్యతగా తెలంగాణ రాష్ట్ర పరిపాలన శత్రు దాడిలో ప్రాణ, ఆస్తినష్టం తగ్గించేందుకు ప్రజలను సిద్ధం చేస్తోంది. పౌర రక్షణ చట్టం 1968 ప్రకారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పుడూ పౌర రక్షణ నిర్వహిస్తాయి. ప్రతికూల పరిస్థితుల్లో స్పందించేందుకు సివిల్ అడ్మినిస్ట్రేషన్ సిద్ధంగా ఉంటాయి. పౌరులకు అవగాహన కల్పించి శిక్షణ ఇస్తాయి. పౌరుల ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు పని చేస్తాయి. శత్రు దాడి సమయంలో ప్రజల ధైర్యాన్ని పెంచేందుకు తోడ్పడతాయి. ఈ మేరకు…
Civil Mock Drill : పహల్గామ్ ఘటనతో ఒక్కసారిగా పరిస్థితిలు మారిపోయాయి.. అయితే.. భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కీలక ఆదేశాలు ఇచ్చింది. అయితే.. ఈ క్రమంలోనే సివిల్ మాక్ డ్రిల్ చేపట్టాలని సూచించింది. రేపు జరగబోయే మాక్ డ్రిల్‌లో అనుసరించాల్సిన దశలు , తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఈ డ్రిల్ ముఖ్య ఉద్దేశ్యం ప్రజలను అప్రమత్తం చేయడం, విపత్కర పరిస్థితుల్లో స్పందించే విధానంపై శిక్షణ ఇవ్వడం , సంబంధిత…