Ban Sugar Exports: పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. అక్టోబర్ నుంచి చక్కెర ఎగుమతులపై నిషేధం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ban Sugar Exports: అత్యల్ప వర్షపాతం కారణంగా చెరకు దిగుబడి తగ్గిన కారణంగా అక్టోబర్‌లో ప్రారంభమయ్యే తదుపరి సీజన్లో చక్కెర ఎగుమతులను భారతదేశం నిషేధించవచ్చని తెలుస్తోంది. వర్షపాతం తగినంత లేకపోవడంతో ఈ సారి చెరకు దిగుబడి తగ్గనుండడంతో చెరకు ధరలకు రెక్కలు వస్తాయని సర్కారు అంచనా వేస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటకలలో రుతుపవనాల వర్షాలు సగటు కంటే 50 శాతం వరకు తక్కువగా ఉండటంతో, అత్యధికంగా చెరకు ఉత్పత్తి చేసే ప్రాంతాలపై ప్రభావం చూపుతున్న వర్షాభావ పరిస్థితులను అనుసరించి ఈ ఊహించిన చర్య జరగనున్నట్లు సమాచారం.
Read Also: PM Modi on Chandrayaan-3: ఈ విజయం దేశం గర్వించే మహోన్నత ఘట్టం
Also Read
- PM Modi: "2047 నాటికి 'వికసిత భారతే లక్ష్యం.. We Will Do It.." దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
- NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
ఏడేళ్ల తర్వాత భారత్ చక్కెర ఎగుమతులపై నిషేధం విధిస్తోంది. ఆహార ద్రవ్యోల్బణంపై భారతదేశం ఆందోళనలను ఎదుర్కొంటోంది. జులైలో రీటైల్ ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్ట స్థాయిలో 7.4 శాతానికి ఎగబాకడం, ఆహార ద్రవ్యోల్బణం 11.5 శాతానికి చేరడంతో భారత్ చెరకు ఎగుమతులపై బ్యాన్ విధించే ప్రతిపాదనను పరిశీలిస్తోందని చెబుతున్నారు.మూడేళ్ల గరిష్టస్ధాయిలో ద్రవ్యోల్బణం పెరగడంతో ఆహారోత్పత్తుల ధరలకు చెక్ పెట్టేందుకు ఎగుమతులపై నిషేధం అనివార్యమని సర్కారు ఆలోచిస్తోంది. ఇక 2023-24 సీజన్లో చెరకు దిగుబడి 3.3 శాతం తగ్గి 31.7 మిలియన్ టన్నులకు పడిపోతుందని అంచనా. గత సీజన్లో 11.1 మిలియన్ టన్నుల చక్కెరతో పోలిస్తే, ప్రస్తుత సీజన్లో 6.1 మిలియన్ టన్నుల చక్కెరను మాత్రమే ఎగుమతి చేయడానికి భారతదేశం మిల్లులను అనుమతించిన తర్వాత ఇది జరిగింది.
ఈ పరిణామాల మధ్య, భారతీయ అధికారులు స్థానిక చక్కెర అవసరాలకు, మిగులు చెరకు నుంచి ఇథనాల్ ఉత్పత్తికి ప్రాధాన్యతనిస్తున్నారు. ఆహార ద్రవ్యోల్బణంపై సంభావ్య ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని దేశంలో తగినంత సరఫరాలు, స్థిరమైన ధరలను నిర్ధారించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో చక్కెర ఎగుమతులపై నిషేధం విధించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులపై నిషేధం, ఉల్లి ఎగుమతులపై 40 శాతం సుంకం విధించడం వంటి చర్యలకు పూనుకున్న భారత్ తాజాగా చక్కెర ఎగుమతులపై నిషేధం విధించనున్నట్లు తెలుస్తోంది. ఈ చర్యలు రాబోయే రాష్ట్రాల ఎన్నికలకు ముందు ఆహార ధరలను నిర్వహించడానికి విస్తృత ప్రయత్నాలలో భాగంగా ఉన్నాయి.
తాజావార్తలు
-
PM Modi: “2047 నాటికి ‘వికసిత భారతే లక్ష్యం.. We Will Do It..” దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
-
Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
-
jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
-
CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
-
Jailer 2: ట్రైలర్లోనే చెప్పేశాడు.. సర్ప్రైజింగ్గా ఏమైనా ఉంటుందా.. వెయ్యి కోట్లు కొల్లగొట్టేస్తుందా?
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!