T20 World Cup 2024: టీమిండియా టీ20 ప్రపంచకప్ ప్రోమో.. గూస్ బంప్స్ పక్కా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Promo for T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024కు సమయం దగ్గరపడుతోంది. జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్ వేదికగా పొట్టి ప్రపంచకప్ జరగనున్న విషయం తెలిసిందే. మే 1 లోపు అన్ని టీమ్స్ తమ జట్లను ప్రకటించాల్సి ఉంది. భారత జట్టును బీసీసీఐ ఏప్రిల్ 28న ప్రకటించే అవకాశం ఉంది. అయితే స్టార్ స్పోర్ట్స్ ఛానల్ టీమిండియా టీ20 ప్రపంచకప్ ప్రోమోకి సంబంధించి ఓ వీడియో రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘టీ20 ప్రపంచకప్ 2024కు భారత్ సిద్ధం’ అంటూ ప్రోమో స్టార్ అయింది. విరాట్ కోహ్లీ బ్యాటింగ్, రవీంద్ర జడేజా బౌలింగ్, రోహిత్ శర్మ బ్యాటింగ్, సూర్యకుమార్ యాదవ్ షాట్స్, హార్దిక్ పాండ్యా బౌలింగ్‌ను వీడియోలో చూపించారు. చివరలో కోహ్లీ సెల్యూట్ చేస్తున్న క్లిప్ అభిమానుల్లో జోష్ నింపుతుంది. బ్యాక్ గ్రౌండ్‌లో వందేమాతర గీతం ప్రోమో వీడియోని రక్తి కట్టించింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. ‘గూస్ బంప్స్ పక్కా’ అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
Also Read: Hardik Pandya: హార్దిక్ పాండ్యా పనైపోయింది.. టీమిండియా మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
టీ20 ప్రపంచకప్ 2024లో మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి. ఈ 20 టీమ్స్ నాలుగు గ్రూపులుగా విడిపోయి పోటీపడతాయి. గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్, కెనడా, యూఎస్ఏ, ఐర్లాండ్ జట్లు ఉన్నాయి. జూన్ 5న న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్‌తో భారత్ తన మొదటి మ్యాచ్ ఆడుతుంది. ఇక క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దాయాదుల సమరం జూన్ 9న న్యూయార్క్ వేదికగానే జరుగనుంది. జూన్ 12న యూఎస్‌ఏ, జూన్ 15న కెనడాతో భారత్ ఆడనుంది.
INDIAN TEAM PROMO FOR THE T20I WORLD CUP. 🇮🇳
– Rohit Army is ready to create history.pic.twitter.com/2jjM9wYQQW
— Johns. (@CricCrazyJohns) April 23, 2024
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యాసంస్థల్లో డ్రగ్స్ కనిపిస్తే యాజమాన్యాలదే బాధ్యత
-
KMM CYBER CASE: లెక్క తేలుస్తారా..?
-
Gun Fire: ఆస్తి కోసం దారుణం.. సొంత వదినపైనే సుపారీ గ్యాంగ్‌తో కాల్పులు..
-
OTR: ‘నేను ఎమ్మెల్యేన్రా.. నన్ను గుర్తించండ్రా’..
-
Trump-Zelensky: మరోసారి వైట్‌హౌస్‌కు జెలెన్స్కీ.. ట్రంప్‌తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!