Hamid Ansari row: ‘‘ దేశానికి హిందువులు ముప్పా.?’’.. హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై దుమారం..
- అన్సారీ ‘‘హిందువులు ముప్పు’’ వ్యాఖ్యలపై వివాదం..
- అన్సారీ వ్యాఖ్యలపై బీజేపీ, వీహెచ్‌పీ తీవ్ర ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hamid Ansari row: మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ వివాదానికి కారణమయ్యాయి. ఏ.జీ నూరానీ స్మారక ఉపన్యాసంలో ఆయన దివంగత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చెప్పిన వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ .. ‘‘భారతదేశానికి ముప్పు కమ్యూనిజం కాదని, హిందూ మితవాద మతతత్వమే’’ అని అన్నారు. ఏ.జి. నూరానీ 2019లో రాసిన ‘ది ఆర్ఎస్ఎస్: ఏ మెనస్ టు ఇండియా’ అనే పుస్తకంలోని ఒక ప్రస్తావన ఆధారంగా తాను ఈ విషయాన్ని చెబుతున్నానని ఆయన స్పష్టం చేశారు.
హమీద్ అన్సారీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ, వీహెచ్‌పీ తీవ్రంగా స్పందిస్తున్నాయి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. హమీద్ అన్సారీ తాను చేపట్టిన పదవి గౌరవాన్ని తీసేశారని, అతడి వ్యాఖ్యలు ఇండియాకు ప్రమాదకరమని, ఆయన వైఖరి యాంటీ-ఇండియాగా ఉందని వ్యాఖ్యానించారు.
Also Read
- INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
- India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
- CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
- Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ కూడా అన్సారీ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం అన్సారీకి పదవులు, గౌరవాలు, అవకాశాలు కల్పించిందని ఆయన అన్నారు. మెజారిటీ హిందూ సమాజాన్ని దేశానికి ముప్పుగా ముద్ర వేయడం ఎలా సమర్థనీయం అని ప్రశ్నించారు. సమాజంలో మెజారిటీ-మైనారిటీ విభజన తేవాలనే మత ఛాందసవా మనస్తత్వం ఉన్నవారే సమాజానికి అసలైన ఆందోళన అని అన్నారు.
బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ అన్సారీ ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది దురదృష్టకరమని, ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో ముస్లింలు విద్యలో, పోటీ పరీక్షల్లో పురోగమిస్తున్నారని ఆయన అన్నారు. దేశం శాంతియుతంగా ఉందని, ఇలాంటి ప్రకటనలకు దూరంగా ఉండాలని సూచించారు. మరో బీజేపీ నేత ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ మాట్లాడుతూ.. సమాజంలో విభజన సృష్టించడానికి ప్రయత్నించే వారి రాజకీయాలు సఫలం కాదని అన్నారు.
బీజేపీ నేత కరుణాసాగర్ కూడా అన్సారీ వ్యాఖ్యల్ని ప్రశ్నించారు. సమస్య తీవ్రవాదం అయితే, వామపక్ష అతివాదం ,ఇస్లామిక్ ఉగ్రవాదం విషయంలో కూడా ఇదే స్పష్టత ఉందా.? అని అడిగారు. ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ సభ్యుడైన ఉమర్ అహ్మద్ ఇల్యాసీ కూడా అన్సారీ ప్రకటనను వ్యతిరేకించారు. ఇలాంటి ప్రకటనలు సామాజిక వాతావరణాన్ని కలుషితం చేయగలవని ఆయన ఆరోపించారు. ముస్లింలను రెచ్చగొట్టే ఏ ప్రకటనలనూ సమాజం తీవ్రంగా పరిగణించదని ఇల్యాసీ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
-
Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!