India Playing 11 vs Australia for 3rd ODI: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నామమాత్రమైన మూడో వన్డే బుధవారం (సెప్టెంబర్ 27) రాజ్‌కోట్‌లో జరగనుంది. సిరీస్ క్లీన్ స్వీప్‌పై భారత్ కన్నేయగా.. సిరీస్‌లో ఒక్క మ్యాచ్ అయినా గెలిచి పరువు కాపాడుకోవాలని ఆసీస్ చూస్తోంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది. అంతకు అర్ధగంట ముందు టాస్ పడనుంది. ఈ మ్యాచ్ జియోసినిమాలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. మూడో వన్డేలో బరిలోకి దిగే భారత జట్టు ఎలా ఉండనుండో ఓసారి చూద్దాం.
తొలి రెండు వన్డేలకు దూరమైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తిరిగి జట్టుతో చేరారు. ప్రతిష్టాత్మక ప్రపంచకప్‌కు ముందు జరుగుతున్న చివరి మ్యాచ్ కాబట్టి ఈ నలుగురు తుది జట్టులోకి రానున్నారు. రెండో వన్డేకు దూరమైన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా జట్టుతో కలిశాడు. అయితే యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్, పేసర్ శార్ధల్ ఠాకూర్ మేనెజ్‌మెంట్ విశ్రాంతి ఇచ్చింది.
ఆసియా గేమ్స్ 2023లో భారత జట్టు కెప్టెన్‌గా ఎంపికైన రుత్‌రాజ్ గైక్వాడ్ చైనాకు వెళ్లనున్నాడు. దాంతో రుత్‌రాజ్ ఆస్ట్రేలియాతో మూడో వన్డేకు దూరం కానున్నాడు. శుబ్‌మన్ గిల్ స్థానంలో రోహిత్ శర్మ బరిలోకి దిగనుండగా.. ఇషాన్ కిషన్ మరో ఓపెనర్‌గా ఆడుతాడు. రుత్‌రాజ్ స్థానంలో విరాట్ కోహ్లీ వస్తాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ ఆడుతారు. శార్ధూల్ ప్లేస్‌లో హార్ధిక్ పాండ్యా వస్తాడు. రవీంద్ర జడేజాకు విశ్రాంతి ఇవ్వాలని మేనెజ్‌మెంట్ భావిస్తే.. కుల్దీప్ యాదవ్ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉంటాడు. ప్రసిద్ద్ కృష్ణ స్ధానంలో జస్ప్రీత్ బుమ్రా తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. మొహ్మద్ షమీ మరో పేసర్‌గా ఆడుతాడు. మొహ్మద్ సిరాజ్ విశ్రాంతి తీసుకుంటాడు.
Also Read: Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా!
భారత తుది జట్టు (3rd ODI India Playing 11):
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, ఆర్ అశ్విన్/ ఆర్ జడేజా, కుల్దీప్ యాదవ్, మొహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా.