గత రెండేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకరమైన యుద్ధం సాగుతోంది. ఇప్పటికే డ్రోన్, వైమానిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే వేలాది ఇళ్లులు నేలమట్టం అయ్యాయి. అనేక మంది నిరాశ్రయులయ్యారు. ఇంకోవైపు ప్రపంచ దేశాలు, ఐక్య రాజ్య సమితి విజ్ఞప్తి చేసినా యుద్ధం మాత్రం ఆగలేదు. నిరాంతరాయంగా బాంబు దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్విట్జర్లాండ్‌లో అత్యున్నత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా భారత్‌ను ఆహ్వానించింది. ఈ భేటీలో ప్రధానంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి చర్చించనున్నారు.
ఇది కూడా చదవండి: Sayaji Shinde Health: ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటుడు సాయాజి షిండే!
ఉక్రెయిన్‌లో శాంతిని నెలకొల్పే లక్ష్యంతో స్విట్జర్లాండ్‌లో ఉన్నత స్థాయి అంతర్జాతీయ సదస్సు జరుగుతోంది. ఈ సమావేశానికి భారత్‌ను ఆహ్వానించారు. ఇటలీలో జరుగుతున్న G7 సమ్మిట్‌కు భారతదేశంతో సహా ప్రధాన గ్లోబల్ సౌత్ దేశాల నాయకులు ఆహ్వానింపబడ్డారు. ఈ సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్‌కు ఉక్రెయిన్-రష్యాతో మంచి సంబంధాలు ఉన్నాయి. మొదటి నుంచి ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని భారత్ వ్యతిరేకిస్తోంది. ఇక తాజాగా జరుగుతున్న సమావేశంలో భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఇది కూడా చదవండి: PM Modi: దర్యాప్తు సంస్థలపై మోడీ కీలక వ్యాఖ్యలు
మొత్తం ఈ సదస్సుకు 120 దేశాలు హాజరుకానున్నాయి. జూన్ 15-16 తేదీల్లో ఈ భేటీ జరగనుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్‌కీ ఇందుకోసం ఒ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. చైనా, భారత్ సహా అనేక దేశాలు హాజరుకానున్నాయి. కానీ రష్యాకు మాత్రం ఆహ్వానం లేనట్లుగా తెలుస్తోంది. ఇటీవల ప్రధాని మోడీ కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడితో ఫోన్‌లో సంభాషించారు. మరోవైపు జూన్ 4నే ఎన్నికల ఫలితాలు వెలువడ నున్నాయి. ఇక మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని మోడీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మోడీనే స్వయంగా ఈ సమావేశానికి హాజరవుతారని తెలుస్తోంది. అలాగే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా హాజరవుతారని సమాచారం. దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు.