Sugar Exports: చక్కెర ఎగుమతులపై నిషేధం.. వచ్చే ఏడాది అక్టోబర్ వరకు పొడిగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sugar Exports: ప్రపంచంలోనే అతిపెద్ద చక్కెర ఉత్పత్తిదారుగా ఉన్న భారతదేశం, చక్కెర ఎగుమతిపై ఆంక్షలను అక్టోబర్ 2023 వరకు ఒక సంవత్సరం పొడిగించినట్లు ప్రభుత్వం శుక్రవారం ఆలస్యంగా ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది. మేలో రికార్డుల ఎగుమతుల తర్వాత దేశీయ ధరల పెరుగుదలను నియంత్రించడానికి భారతదేశం ఈ నెలాఖరు వరకు ఎగుమతులను పరిమితం చేసింది. భారతదేశం ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో చక్కెర పంటను ఉత్పత్తి చేస్తుందని అంచనా వేయబడింది. దీని వలన న్యూఢిల్లీ 8 మిలియన్ టన్నుల వరకు ఎగుమతులు చేయవచ్చని ప్రభుత్వం, వ్యాపార వర్గాలు ఈ నెల మొదటివారంలో వెల్లడించాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా చక్కెర ఎగుమతిపై ఉన్న నిషేధాన్ని కేంద్రం మరోసారి పొడిగించింది.
Vande Bharat Express: వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు మళ్లీ యాక్సిడెంట్.. ఈ సారి ఎద్దు..
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
దేశంలో ద్రవ్యోల్భణం పెరుగుతుండటంతో నిత్యావసరాల ధరలు నానాటికి పెరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చక్కెర ధరలను నియంత్రించడంలో భాగంగా ఈ ఏడాది జూన్ 1 నుంచి అక్టోబర్ నెలాఖరు వరకు వరకు ఎగుమతులపై నిషేధం విధించింది. మరో రెండు రోజుల్లో ఈ గడువు ముగుస్తుండటంతో ఆంక్షలను మరో ఏడాదిపాటు పొడిగించింది. 2023 అక్టోబర్ వరకు నిషేధం అమల్లో ఉంటుందని తెలిపింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో దేశంలో చక్కెర ధరలను నియంత్రించవచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రపంచంలో చక్కెర ఎగుమతి చేస్తున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉన్నది. గతకొన్నేండ్లుగా ప్రతి సంవత్సరం దేశం నుంచి చక్కెర ఎగుమతులు పెరుగుతూ వస్తున్నాయి.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!