IND W vs SL W: చివర్లో తడబడ్డ టీమిండియా.. విక్టరీ సాధించిన శ్రీలంక.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND W vs SL W: కోలంబోలోని ఆర్.పి.ఎస్ మైదానంలో నేడు జరిగిన శ్రీలంక మహిళల వన్డే ట్రై సిరీస్‌లో భారత్‌పై శ్రీలంక మహిళల జట్టు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు 50 ఓవర్లలో 275 పరుగులు చేసింది. 276 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక జట్టు 49.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేధించి మ్యాచ్‌ను గెలుచుకుంది.
Read Also: Riyan Parag: వరుసగా ఆరు సిక్స్‌లు బాదిన రియాన్ పరాగ్.. వీడియో వైరల్!
Also Read
- Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు...
- UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
- RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
- BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
ఇక భారత మహిళల జట్టు బ్యాటింగ్‌లో రిచా ఘోష్ (58 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు 58 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. ఆ తర్వాత జెమీమా రోడ్రిగ్స్ (37), ప్రతికా రావల్ (35), హర్మన్‌ప్రీత్ కౌర్ (30) రాణించడంతో మంచి స్కోరు నమోదు చేశారు. చివరి వరుసలో కాష్వీ గౌతమ్ (17), స్నేహ రాణా (10) పరుగులతో రాణించారు. దీనితో మొత్తం 50 ఓవర్లలో భారత జట్టు 9 వికెట్లు కోల్పోయి 275 పరుగులు చేసింది. ఇక శ్రీలంక బౌలింగ్‌లో చమారి అథపత్తు, సుగందికా కుమారి చెరో 3 వికెట్లు తీసి భారత్‌ను కట్టడి చేశారు. విహంగా, ఇనోకా రణవీర ఒక్కొక్క వికెట్ తీశారు.
Read Also: Murshidabad riots: బెంగాల్ ముర్షిదాబాద్ అల్లర్లపై గవర్నర్ సంచలన రిపోర్ట్.. ఉగ్రవాదంపై హెచ్చరిక..
ఇక లక్ష్య ఛేదనలో శ్రీలంక జట్టు ఓపెనర్లు ఆరంభాన్ని నెమ్మదిగా మొదలు పెట్టిన, మిడిల్ ఆర్డర్ లో హర్షితా సమరవిక్రమ (53), కవిషా దిల్హారి (35), కెప్టెన్ అథపత్తు (23) మంచి ఆటతీరు కనబరిచారు. కానీ, మ్యాచ్ లో నిలక్షికా సిల్వా కేవలం 33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంతో 56 పరుగులు చేసి టీమ్‌కు విజయాన్ని అందించింది. దీనితో ఆమెకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు’ లభించింది. చివర్లో అనుష్కా సంజీవని (23 నాటౌట్), సుగందికా కుమారి (19 నాటౌట్) గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఇక భారత బౌలింగ్ పరంగా చూస్తే.. స్నేహ రాణా 3 కీలక వికెట్లు తీసింది. అలాగే ప్రతికా రావల్, శ్రీ చరణి ఒక్కొక్క వికెట్ తీశారు. ఈ విజయంతో శ్రీలంక మహిళల జట్టు ట్రై సిరీస్‌లో కీలకమైన మ్యాచ్‌లో విజయాన్ని సాధించి పాయింట్ల పట్టికలో ముందంజ వేసింది.
తాజావార్తలు
-
Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు…
-
Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!