Its all over for Virat Kohli And Rohit Sharma in T20 Internationals: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు బీసీసీఐ బుధవారం జట్టుని ప్రకటించింది. బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే భారత మాజీ పేసర్ అజిత్ అగార్కర్ తనదైన మార్క్ చూపించాడు. విండీస్‌తో టీ20 సిరీస్‌కు యువ ఆటగాళ్లతో కూడిన జట్టును అగార్కర్ నేతృత్వంలోని సెలక్టర్లు ఎంపిక చేశారు. ఐపీఎల్ 2023లో పరుగులు చేసిన యువ ప్లేయర్లు యశస్వి జైశ్వాల్, తిలక్ వర్మలకు అవకాశం ఇచ్చారు. టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో అందరూ యువకులే. హార్దిక్ పాండ్యా సారథ్యంలో యువ ప్లేయర్స్ ఆడనున్నారు.
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో భారత సీనియర్ ప్లేయర్స్ ఎవరూ లేరు. టీ20 ప్రపంచకప్ 2022 ముగిసి ఇప్పటికి 8 నెలలు అవుతోంది. ఆ తర్వాత భారత జట్టు ఆడిన ఏ టీ20 సిరీస్‌లోనూ సీనియర్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఆడలేదు. విశ్రాంతి అంటూ వారిని పక్కన పెట్టేస్తున్నారు. ఇదే కారణంతో వారు ప్రతి సిరీస్‌కు దూరంగానే ఉంటున్నారు. తాజాగా వెస్టిండీస్‌తో టీ20లకు ఎంపిక చేసిన జట్టులోనూ కోహ్లీ, రోహిత్ లేరు. వన్డే ప్రపంచకప్ 2023 ఉన్న నేపథ్యంలో టీ20 ఫార్మాట్‌లో వారికి చోటివ్వలేదు.
Also Read: Samantha New Bride: పెళ్లి కూతురి గెటప్‌లో సమంత.. వైరల్ వీడియో!
టీ20 ప్రపంచకప్ 2023 తర్వాత రోహిత్ శర్మను టీ20 కెప్టెన్‌గా తప్పించ లేదు. కానీ హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వరుసగా మూడు పొట్టి సిరీస్‌లలో భారత్ ఆడింది. సీనియర్లకు చోటు దక్కడం లేదు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు వయసు మీద పడినా.. వారిపై వేటు వేయలేరు. అయితే కుర్రాళ్ల ఫార్మాట్ అయిన టీ20ల నుంచి 2007లో సచిన్ టెండ్యూలర్, రాహుల్ ద్రవిడ్ లాంటి సీనియర్లు స్వయంగా తప్పుకొన్నట్లే.. ఇప్పుడు వీళ్లు కూడా దూరం కావొచ్చు. 2024 ప్రపంచకప్‌ని దృష్టిలో ఉంచుకుని.. బీసీసీఐ యువ ఆటగాళ్లకు పెద్ద పీట వేస్తోంది. మర్యాదపూర్వకంగానే రోహిత్, కోహ్లీలను టీ20ల నుంచి తప్పుకోమని చెప్పినా ఆశ్చర్యం లేదు. కోహ్లి, రోహిత్ పరిస్థితిని అర్థం చేసుకుంటే.. ఇకపై వారిని పొట్టి ఫార్మాట్‌లో చూడలేం. మొహ్మద్, ఆర్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్ లాంటి సీనియర్లు కూడా టీ20లు ఆడే అవకాశం లేదు.
వెస్టిండీస్‌తో టీ20లకు భారత జట్టు (India T20I Squad vs West Indies):
ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైశ్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముకేశ్ కుమార్.
Also Read: Salaar Teaser: ‘సలార్’ టీజర్‌ను కేజీఎఫ్-2తో పోల్చుతున్న ఫాన్స్.. బాలేదంటూ..!