Samantha Spotted as Bride at Temple: శివ నిర్వాణ దర్శకత్వంలో ‘రౌడీ హీరో’ విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తోన్న సినిమా ‘ఖుషీ’. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఇక మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్ అందించిన ‘నా రోజా నువ్వే’ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరిని నోట ఇదే పాట వస్తోంది. యూట్యూబ్‌లో అయితే రికార్డులు క్రియేట్ చేస్తోంది.
ఖుషీ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కేరళ, రామోజీ ఫిలిం సిటీ, కశ్మీర్ ప్రాంతాల్లో షూటింగ్ జరిగింది. ఇప్పుడు ఈ సినిమా చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. తాజాగా కాకినాడ ద్రాక్షారామం పరిసర ప్రాంతాల్లో చివరి షెడ్యూల్ షూటింగ్ చేశారు. ఆలయంలో విజయ్, సమంతలపై క్లైమాక్స్ ఎపిసోడ్ చిత్రీకరించారు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో సమంత రెడ్ కలర్ చీరలో పెళ్లి కూతురి గెటప్‌లో కనిపిస్తున్నారు.
Also Read: Salaar Teaser: ‘సలార్’ టీజర్‌ను కేజీఎఫ్-2తో పోల్చుతున్న ఫాన్స్.. బాలేదంటూ..!
ఈ వీడియోలో గుడిలో కుటుంబసభ్యులంతా యాగం చేస్తున్నారు. సమంత రెడ్ కలర్ చీరలో విజయ్ పంచ కట్టులో ఆకట్టుకున్నారు. సాంప్రదాయ దుస్తుల్లో వీరిద్దరూ నమస్కారం పెట్టారు. మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్ కూడా అక్కడ ఉన్నారు. ఇక ఖుషి సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో విజయ్-సమంత భార్య భర్తలుగా కనిపించనున్నట్లు సమాచారం తెలుస్తోంది. సమంత సెట్స్ నుంచి సెల్ఫీ తీసుకుని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా స్టోరీలో పోస్ట్ చేశారు. అందులో ఆమె మెడలో నల్లపూసలు ఉన్నాయి.
ఖుషి సినిమా షూటింగ్ అయిపోవడంతో పోస్టు ప్రొడక్షన్ వర్క్ మొదలవ్వనుంది. సెప్టెంబర్ 1న ఈ సినిమా రిలీజ్ కానుంది. కుటుంబసమేతంగా ఈ చిత్రాన్ని తిలకించే విధంగా ఉండబోతుంది. ఇక ఖుషి సినిమా షూటింగ్ కూడా పూర్తవ్వడంతో.. సమంత ఒక ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నారు. ఆరోగ్యంపై మరింత ఫోకస్ చేసేందుకే ఈ బ్రేక్ అని సమాచారం.
@samantharuthprabhuoffl and @thedeverakonda perform a Pooja at the last schedule of their movie #Kushi ❤️ 🙏#samantha #samantharuthprabhu #nagachaitanya #samantharuthprabhufans #nagachaitanyafans #varundhawan #samantharuthprabhu #SamanthaRuthPrabhu #nagachaitanya pic.twitter.com/dI6z95LBrE
— BTown Ki Billi South Cinema (@bkbsouthcinema) July 5, 2023
Snaps from the set of #Kushi ❤️@Samanthaprabhu2 #SamanthaRuthPrabhu𓃵 #SamanthaRuthPrabhu #Samantha pic.twitter.com/4FSsk8HIJR
— 𝐓𝐍 𝐒𝐚𝐦𝐚𝐧𝐭𝐡𝐚 𝐅𝐚𝐧𝐬 (@TN_SamanthaFans) July 4, 2023
Also Read: Gold Price Today: పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే?
Omg the prettiest😍🥺❤️ @Samanthaprabhu2 #SamanthaRuthPrabhu #Kushi pic.twitter.com/oK3MdGSB02
— NARESH (@naresh__off_) July 4, 2023