West Indies vs India 1st ODI Timings, Live Streaming and Pitch Report Details: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ పూర్తియింది. 1-0తో టెస్ట్ సిరీస్ కైసవం చేసుకున్న భారత్.. మూడు వన్డేల సిరీస్‌పై కనేసింది. బ్రిడ్జ్‌టౌన్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా నేడు జరిగే తొలి వన్డేలో ఆతిథ్య వెస్టిండీస్‌తో రోహిత్ సేన అమీతుమీ తేల్చుకోనుంది. ఆసియా కప్ 2023కి ముందు భారత్ ఆడే చివరి వన్డే సిరీస్ ఇదే కావడం, ప్రపంచకప్ 2023కి కూడా సన్నాహకంగా ఉపయోగించుకోనుండడంతో ఈ మ్యాచ్‌లకు ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు టెస్టుల్లో తేలిపోయిన విండీస్‌కు వన్డే సిరీస్‌లో మాత్రం బలమైన జట్టు ఉంది. స్టార్ ప్లేయర్స్ జట్టులో ఉండడంతో వన్డే పోరు రసవత్తరంగా సాగనుంది.
IND vs WI 1st ODI Timings:
కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా నేడు భారత్-వెస్టిండీస్ తొలి వన్డే జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ఆరంభం కానుంది. సాయంత్రం 6.30కి టాస్ పడుతుంది. అయితే ఈ సిరీస్ చూడాలంటే భారత్ అభిమానులకు కష్టమే. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుండగా.. మరుసటి రోజు వేకువజామున 3 గంటలకు మ్యాచ్ ముగుస్తుంది. మ్యాచ్ చూడాలంటే.. నిద్ర పోకూడదు. నిద్రపోయి లేచే వరకు మ్యాచ్ అయిపోతుంది.
IND vs WI 1st ODI Live Streaming:
అభిమానులు ఎక్కువ మంది మ్యాచ్ చూసే పరిస్థితి లేదు కాబట్టి.. సిరీస్ బ్రాడ్‌కాస్టింగ్ హక్కులకు స్టార్ స్పోర్ట్స్, సోనీ దూరంగా ఉన్నాయి. ఓటీటీ వేదికగా ‘జియో సినిమా’ ఈ మ్యాచ్‌లలను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. భారత ప్రభుత్వానికి చెందిన దూరదర్శన్ చానెల్‌లోనూ లైవ్ వస్తుంది. టెస్ట్ సిరీస్‌ను జియో సినిమా, దూరదర్శన్ చానెల్‌లు ప్రసారం చేశాయి. జియో సినిమా కేవలం హిందీ, ఇంగ్లీష్ కామెంట్రీ మాత్రమే అందిస్తుంది. తెలుగు కామెంట్రీ కావాలంటే.. దూరదర్శన్ చానెల్ (డీడీ సప్తగిరి, డీడీ యాదగిరి) చూడాల్సిందే.
IND vs WI 1st ODI Pitch Report:
తొలి వన్డేకు ఆతిథ్యమివ్వనున్న కెన్సింగ్‌టన్ ఓవల్ పిచ్ బౌలర్లు, బ్యాటర్లకు సహకరిస్తుంది. ఇక్కడ మోస్తరు స్కోర్లు నమోదవుతాయి. లక్ష్యం 250 దాటితే.. ఛేదన చాలా కష్టం. బౌలర్లలో పేసర్లకే ఎక్కువ అనుకూలించే ఈ పిచ్‌పై.. స్పిన్నర్లు కూడా కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. తొలి వన్డేకు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు 20-30 శాతం ఉన్నట్లు సమాచారం. బ్రిడ్జ్‌టౌన్‌లో అడపాదడపా జల్లులు పడే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read: SPY Movie OTT: నెల తిరగకుండానే.. ఓటీటీలోకి వచ్చేసిన ‘స్పై’ మూవీ! స్ట్రీమింగ్ ఎందులోనో తెలుసా?