Aakash Chopra React on Shubman Gill to bat at No 3: భారత యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ ఆర్డర్‌పై టీమిండియా మాజీ ప్లేయర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. భారత క్రికెట్‌లో విజ్ఞప్తులు చేయడం సాధారణంగా జరగవు అని అన్నాడు. పాలనా స్థానంలో ఆడాలనుందని మేనేజ్‌మెంట్‌కు ఆటగాడు చెప్పడం ఇది వరకు చూడలేదన్నాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రోహిత్ శర్మతో పాటు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. దాంతో శుభ్‌మన్ గిల్ మూడో స్థానంలో ఆడనున్నాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందే ఓపెనర్‌గా జైస్వాల్ వస్తాడని రోహిత్ వెల్లడించాడు. తాను మూడో స్థానంలో ఆడతానని మేనేజ్‌మెంట్ దృష్టికి గిల్ తీసుకొచ్చాడని భారత కెప్టెన్ చెప్పాడు. ఈ విషయంపైనే ఆకాశ్ మాట్లాడాడు.
‘మూడో స్థానంలో ఆడతానని టీమ్ మేనేజ్‌మెంట్‌ను శుభ్‌మన్ గిల్ కోరినట్లు కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. ఇది నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఎందుకంటే భారత క్రికెట్‌లో ఇలాంటివి సాధారణంగా జరగవు. తమకు ఆ స్థానంలో ఆడాలని ఉందని మేనేజ్‌మెంట్‌కు ఆటగాడు చెప్పడం గతంలో చూడలేదు. బ్యాటింగ్ ఆర్డర్‌పై విజ్ఞప్తులు చేయడంగానీ, అవకాశం ఇవ్వడం గానీ జరిగిన సందర్భాలు లేవు. అయితే యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ ఓపెనర్‌గా రావడం బాగుంది. జట్టుతో పాటు జైస్వాల్‌కు కూడా శుభారంభమే దక్కింది’ అని ఆకాశ్ చోప్రా అన్నాడు.
‘మూడో స్థానంలో శుభ్‌మన్ గిల్ ఆడితే భవిష్యత్తులో భారత జట్టుకు ప్రయోజనకరంగా ఉంటుంది. టెస్టు క్రికెట్‌లో ఓపెనింగ్ పాత్ర చాలా క్లిష్టమైంది. మూడో స్థానంలో ఆడటం కూడా సవాల్‌తో కూడుకున్నదే. నాలుగో స్థానం కూడా చాలా కీలకమే. టాప్ ఆర్డర్‌లోనాణ్యమైన బ్యాటర్ ఉండాలి. గిల్‌ను మూడో స్థానంలో ఆడించడం నాకు ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే ఇదే విషయాన్ని మూడేళ్ల క్రితమే నేను చెప్పా. మిడిలార్డర్‌లో అతడిని చూడొచ్చని అప్పుడే ట్వీట్ చేశా. అదే జరుగుతోంది. గిల్ భారత్‌కు సుదీర్ఘకాలం ఆడతాడు’ అని ఆకాశ్ చోప్రా ఆశాభావం వ్యక్తం చేశాడు.
Also Read: iPhone 14 Offers: ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. ఆఫర్ రెండు రోజులు మాత్రమే!
Also Read: Virat Kohli Pakistan: పాకిస్థాన్ టూర్‌లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, హీరోయిన్ దీపికా పదుకొణె!