Temba Bavuma Ruled Out Of IND vs SA Second Test: సెంచూరియన్ వేదికగా టీమిండియాతో గురువారం ముగిసిన మొదటి టెస్టులో దక్షిణాఫ్రికా అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. రోహిత్ సేనను ఏకంగా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓడించింది. అద్భుత విజయం సాధించి జోష్‌లో ఉన్న దక్షిణాఫ్రికాకు భారీ షాక్ తగిలింది. కేప్‌టౌన్ వేదికగా భారత్‌తో జరగనున్న రెండో టెస్టుకు ప్రొటీస్ కెప్టెన్ టెంబా బావుమా దూరమయ్యాడు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న బావుమాకు విశ్రాంతి అవసరం కాగా.. రెండో టెస్ట్ నుంచి తప్పుకున్నాడు. మొదటి టెస్టు తొలి రోజు ఆట సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ బావుమా గాయపడ్డాడు.
Also Read: Rohit Sharma: మా బ్యాటింగ్ చెత్తగా సాగింది.. బుమ్రాపైనే ఆధారపడితే పని జరగదు!
టెంబా బావుమా తొలి టెస్టుల్లో గాయపడ్డాక తిరిగి మైదానంలో అడుగుపెట్టలేదు. గాయం కొంచెం తీవ్రమైనది కావడంతో.. రెండో టెస్టుకు అతడు దూరమయ్యాడు. రెండో టెస్టుకు బావుమా దూరమయ్యాడని దక్షిణాఫ్రికా హెడ్ కోచ్ షుక్రి కాన్రాడ్ తెలిపారు. బావుమా గాయం నుంచి కోలుకోవడానికి మరో రెండు వారాల సమయం పట్టే అవకాశముందన్నారు. రెండో టెస్టులో డీన్ ఎల్గర్ జట్టును నడిపించనున్నాడని చెప్పారు. బావుమా స్ధానంలో జైబుర్ హంజా జట్టులోకి వచ్చాడని దక్షిణాఫ్రికా హెడ్ కోచ్ పేర్కొన్నారు. జనవరి 3 నుంచి కేప్‌టౌన్ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది.