IND vs SA: హమ్మయ్యా గెలిచాం.. కానీ భయపెట్టిన దక్షిణాఫ్రికా..!
- రాంచీలో జరిగిన తొలి వన్డేలో భారత్ 17 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం
- విరాట్ కోహ్లి అద్భుత సెంచరీ (135)తో భారత్ భారీ స్కోరు 349/8
- రోహిత్ శర్మ (51), కేఎల్ రాహుల్ (56) కీలక ఇన్నింగ్స్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs SA: రాంచీలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసింది. విరాట్ కోహ్లి అద్భుతమైన సెంచరీతో భారత్ భారీ స్కోరు సాధించినప్పటికీ, దక్షిణాఫ్రికా పోరాడి భారత్‌ను భయపెట్టింది. కానీ చివరకు టీమిండియా 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (18) త్వరగా అవుటైనా, మరో ఓపెనర్ రోహిత్ శర్మ (57 బంతుల్లో 51) రాణించాడు. అయితే, భారత ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచింది విరాట్ కోహ్లి (120 బంతుల్లో 135, 17 ఫోర్లు, 3 సిక్సర్లు) క్లాసిక్ ఇన్నింగ్స్. దీనితో విరాట్ కోహ్లి వన్డేల్లో తన 52వ సెంచరీని నమోదు చేశాడు. మధ్యలో రుతురాజ్ గైక్వాడ్ (8), వాషింగ్టన్ సుందర్ (13) విఫలమైనా, కెప్టెన్ కేఎల్ రాహుల్ (56 బంతుల్లో 60, 7 ఫోర్లు, 2 సిక్సర్లు) కోహ్లికి చక్కటి సహకారం అందించాడు. చివర్లో రవీంద్ర జడేజా (20 బంతుల్లో 32, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో భారత్ 349 పరుగుల భారీ స్కోరును అందుకుంది. ఇక దక్షిణాఫ్రికా బౌలర్లలో నండ్రే బర్గర్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, ఓట్నీల్ బాట్మాన్ తలో 2 వికెట్లు పడగొట్టారు.
Operation Sindoor: పాకిస్తాన్‌కు వార్నింగ్.. “ఆపరేషన్ సిందూర్”పై నేవీ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
350 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. కేవలం 7 పరుగులకే రయాన్ రికెల్టన్ (0), క్వింటన్ డి కాక్ (0), ఆ తర్వాత ఐడెన్ మార్క్రామ్ (11) వికెట్లను కోల్పోయింది. ఒక దశలో 77 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే టోనీ డి జోర్జి (39), డెవాల్డ్ బ్రెవిస్ (37) కొంతవరకు ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఆ తర్వాత ఆల్‌రౌండర్లు మార్కో జాన్సెన్ (70 బంతుల్లో 39, 5 ఫోర్లు, 6 సిక్సర్లు), కార్బిన్ బాష్ (67 బంతుల్లో 51) దూకుడుగా ఆడి టీమిండియా అభిమానుల్లో ఆందోళన కలిగించారు. ఈ ఇద్దరూ కలిసి మెరుపు ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లారు. అయితే మిగిలిన బ్యాటర్లు విఫలమవడంతో దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలో 332 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇక భారత బౌలర్లలో హర్షిత్ రాణా 3 వికెట్లతో అద్భుతంగా రాణించగా, సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 4 నాలుగు కీలక వికెట్లు పడగొట్టి భారత్‌కు విజయాన్ని అందించాడు. చివర్లో అర్షదీప్ సింగ్ 2 రెండు వికెట్లు తీసి దక్షిణాఫ్రికా పతనాన్ని పూర్తి చేశాడు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడంతో, మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
Shah Rukh Khan: నిన్ను ఆ జెర్సీలో తప్ప మరోదానిలో చూడలేను.. షారుఖ్ ఖాన్ ఎమోషనల్ పోస్ట్..!
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!