Virat Kohli Nine Thousand Test Runs Record: సొంతగడ్డపై బంగ్లాదేశ్‌ను టెస్టు, టీ20 ఫార్మాట్‌లో క్లీన్‌స్వీప్ చేసిన భారత్.. స్వదేశంలో మరో టెస్టు సిరీస్‌కు సిద్ధమైంది. బుధవారం (అక్టోబర్ 16) నుంచి న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్ ఆరంభం కానుంది. బెంగళూరు వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే.. కివీస్ సిరీస్ టీమిండియాకు ఎంతో కీలకం. గెలుపే లక్ష్యంగా రోహిత్ సేన బరిలోకి దిగుతోంది. అయితే కివీస్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. అరుదైన రికార్డుపై కన్నేశాడు.
న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో విరాట్ కోహ్లీ మరో 53 పరుగులు చేస్తే.. సుదీర్ఘ ఫార్మాట్‌లో 9000 వేల పరుగులు పూర్తి చేసుకుంటాడు. భారత్ తరఫున ఈ ఫీట్ సాధించిన నాలుగో ఆటగాడిగా రికార్డుల్లో నిలుస్తాడు. ఈ జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (15,921) అగ్ర స్థానంలో ఉన్నాడు. ది వాల్ రాహుల్ ద్రవిడ్ (13,265), లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ (10,122) విరాట్ కంటే ముందు స్థానాల్లో ఉన్నారు. న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో విరాట్ 9 వేల మార్క్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read: పొట్టి డ్రెస్‌లో పూజా హెగ్డే.. బుట్టబొమ్మ అందాలు చూశారా?
విరాట్ కోహ్లీ ఈ ఏడాది టెస్టుల్లో ఇప్పటివరకు ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. 2024లో ఆరు ఇన్నింగ్స్‌లు ఆడిన విరాట్.. దక్షిణాఫ్రికాపై 46, బంగ్లాదేశ్‌పై 47 పరుగులు చేసి తృటిలో హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు. కివీస్‌తో టెస్టులలో అయినా అర్ధ శతకం నమోదుచేయాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. విరాట్ ఇప్పటివరకు 114 టెస్టుల్లో 8871 రన్స్ చేశాడు. ఇందులో 29 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.