IND vs ENG 4th Test: ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ!
- జులై 23 నుంచి మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్ట్
- భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ
- అర్ష్‌దీప్ స్థానంలో అన్షుల్ కాంబోజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BCCI Update India Squad for 4th vs England: జులై 23 నుంచి మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరగనున్న నాలుగో టెస్ట్ కోసం మార్పులతో భారత జట్టును (అప్‌డేట్ టీమ్) బీసీసీఐ ప్రకటించింది. ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఎడమ మోకాలి గాయం కారణంగా మిగిలిన రెండు టెస్ట్‌లకు దూరమయ్యాడు. పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఎడమ బొటన వేలు గాయం కారణంగా నాల్గవ టెస్ట్‌లో ఆడడం లేదు. అర్ష్‌దీప్ స్థానంలో ఫాస్ట్ బౌలర్ అన్షుల్ కాంబోజ్‌ను జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ పేర్కొంది. కాంబోజ్ ఇప్పటికే మాంచెస్టర్‌లో భారత జట్టులో చేరాడు.
గాయం బారిన పడిన పేసర్ ఆకాష్ దీప్ మాంచెస్టర్ టెస్ట్‌కు అందుబాటులోనే ఉన్నాడు. ఆకాష్ నాలుగో టెస్టులో ఆడుతాడో లేదో చూడాలి. నితీశ్ కుమార్ రెడ్డికి బదులు మరలా శార్దూల్ ఠాకూర్ ఆడే అవకాశాలు ఉన్నాయి. జస్ప్రీత్ బుమ్రా లేదా మహమ్మద్ సిరాజ్‌లలో ఒకరికి విశ్రాంతి ఇచ్చి.. అర్ష్‌దీప్ సింగ్‌ను అరంగేట్రం చేయిద్దామని టీమ్ మేనేజ్‌మెంట్ భావించింది. కానీ ఇప్పుడు అది సాధ్యపడదు. బుమ్రా, సిరాజ్ ఇద్దరూ తుది జట్టులో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకరికి రెస్ట్ ఇచ్చి ప్రసిద్ధ్ కృష్ణ లేదా అన్షుల్ కాంబోజ్‌ను దింపే అవకాశాలు లేకపోలేదు. రిషభ్ పంత్ గాయంపై స్పష్టత లేదు. దాంతో ఇప్పుడు నాలుగో టెస్ట్ భారత తుది జట్టుపై ఆసక్తి నెలకొంది. చూడాలి మరి మాంచెస్టర్లో ఎవరు ఆడుతారో.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
Also Read: Viral Video: 2 రూపాయలకే షర్ట్.. ఎగబడిన యువకులు! చివరకు..
నాల్గవ టెస్టు కోసం అప్‌డేట్ టీమ్:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రిత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, కుల్దీప్ యాదవ్, అన్షుల్ కాంబోజ్.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!