2 Rupee Shirt Instagram Video Goes Viral in Narsapur: ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘ఇన్‌స్టాగ్రామ్’ హవా తెగ నడుస్తోంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇన్‌స్టాగ్రామ్‌కు దాసోహం అయ్యారు. కొద్దిపాటి సమయం దొరికినా.. ఇన్‌స్టా ఓపెన్ చేసి రీల్స్ చూస్తున్నారు. ఇన్‌స్టా క్రేజ్ కారణంగా ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్ ప్రచారం చేసుకుంటున్నారు. ముఖ్యంగా బట్టల వ్యాపారాలు. కేవలం 125 రూపాయలకే ఇక్కడ షర్ట్ ఇచ్చేస్తున్నారు మావ, 999 రూపాయలకే 3 ప్రీమియం షర్ట్స్ అంటూ రీల్స్ చేస్తున్నారు. రీల్స్ చూసి షాప్ దగ్గరికి వెళ్తే.. అంతా మోసం. ఇలాంటివి ఎన్నో ఘటనలు జరిగాయి. తాజాగా మెదక్ జిల్లాలో మరో మోసం వెలుగులోకి వచ్చింది.
నర్సాపూర్‌లో ‘చేతన్ మేన్స్ వేర్’ అనే బట్టల షాపు ఓనర్ చేతన్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ రీల్ పోస్ట్ పెట్టాడు. 2 రూపాయలకే షర్ట్ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రచారం చేశాడు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి 11 గంటల 10 నిమిషాల వరకు రెండు రూపాయలకే షర్ట్ ఇస్తానని ప్రచారం చేసుకున్నాడు. నర్సాపూర్ చుట్టుపక్కల వారందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరాడు. సోషల్ మీడియాలో చేతన్ పోస్ట్ వైరల్ అయింది.
Also Read: Chairman’s Desk: యువత రాజకీయాల్లోకి ఎందుకు రావట్లేదు?.. కారణాలు ఇవేనా?
2 రూపాయలకే షర్ట్ వస్తుండడంతో యువకులు ఎంతో ఆశతో ఈరోజు ఉదయం షాపు వద్దకు వచ్చారు. చేతన్ మేన్స్ వేర్ షాప్ వద్దకు భారీగా యువకులు చేరడంతో.. యువకుల మధ్య తోపులాట జరిగింది. భారీగా యువకులు రావడంతో ఓనర్ చేతన్ ఒక్కసారిగా బెంబేలెత్తిపోయాడు. ఓనర్ షాపు క్లోజ్ చేసి పరార్ అయ్యాడు. విషయం తెలుకున్న పోలీసులు షాప్ వద్దకు వచ్చి యువకులను చెదరగొట్టారు. కేసు నమోదు చేసుకున్న నర్సాపూర్ పోలీసులు.. షాప్ ఓనర్ చేతన్ కోసం గాలిస్తున్నారు.