IND vs BAN: బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్.. జాగ్రత్త సుమీ! వీళ్లతోనే ముప్పు
- సెప్టెంబర్ 19 నుంచి టెస్టు సిరీస్
- పాకిస్థాన్‌ను మట్టికరిపించిన బంగ్లాదేశ్
- తేలిగ్గా తీసుకుంటే మూల్యం చెల్లించుకోక తప్పదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెప్టెంబర్ 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆరంభం కానుంది. ఈ సిరీస్ కోసం ఇరు జట్లు సన్నద్ధమవుతున్నాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కీలకమైన ఈ సిరీస్‌ను గెలవాలని టీమిండియా చూస్తోంది. సొంతగడ్డపై సిరీస్ కాబట్టి రోహిత్ సేనకు గెలుపు లాంఛనమే. అయితే ఇటీవల పాకిస్థాన్‌ను దాని సొంతగడ్డపై 2-0తో బంగ్లా మట్టికరిపించింది. పాకిస్థాన్‌లో ఇంతకుముందు ఒక్క టెస్టూ గెలవని బంగ్లా ఏకంగా సిరీస్‌నే క్లీన్‌స్వీప్ చేసి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు అదే ఉత్సాహంతో భారత గడ్డపై అడుగుపెట్టింది. బంగ్లాను తేలిగ్గా తీసుకుంటే మాత్రం భారత్ మూల్యం చెల్లించుకోక తప్పదు.
భారత్‌లో సిరీస్ అంటే స్పిన్నర్లదే ఆధిపత్యం. ప్రత్యర్థి జట్లు మన స్పిన్నర్ల వలలో చిక్కుకుని సిరీస్‌లు కోల్పోతుంటాయి. ఉపఖండ టీమ్స్ కూడా భారత్ ముందు నిలవలేవు. ఇప్పుడు బంగ్లాదేశ్ మాత్రం ఇందుకు మినహాయింపు. ప్రస్తుతం ఆ జట్టులో ప్రమాదకర స్పిన్నర్లు ఉన్నారు. మెహిదీ హసన్ మిరాజ్, షకిబ్ అల్‌హసన్‌ల నుంచి భారత బ్యాటర్లకు పెను ముప్పు పొంచి ఉంది. పాకిస్థాన్‌పై మిరాజ్ రెచ్చిపోయాడు. రెండు టెస్టుల్లోనూ చెలరేగి (9 వికెట్స్) పాక్ నడ్డి విరిచాడు. బ్యాటుతో 77, 78 పరుగులు చేశాడు.
Also Read
- Hyderabad: రూ.10 కోసం ప్రాణం తీశారు.. హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణ హత్య
- జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
- Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
- 180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
షకిబ్ అల్‌హసన్ ఎంతటి ప్రమాదక ఆల్‌రౌండరో మనకు తెలిసిందే. పాక్‌పై బ్యాటింగ్‌లో విఫలమైనా.. బంతితో రాణించాడు. భారత వికెట్లపై అంతర్జాతీయ మ్యాచ్‌లకు తోడు ఐపీఎల్ అనుభవం కూడా ఉంది. స్పిన్‌కు అనుకూలించే చెన్నై, కాన్పూర్ పిచ్‌లపై షకిబ్ రెచ్చిపోనున్నాడు. షకిబ్, మెహిదీలతో జాగ్రత్తగా ఉండాల్సిందే. భారత్‌లో పిచ్‌లు స్పిన్‌కు ఇంకా అనుకూలం కాబట్టి బంగ్లా మరో స్పిన్నర్‌ను కూడా ఆడించే అవకాశాలు ఉన్నాయి. తైజుల్, నయీమ్‌ల రూపంలో మరో ఇద్దరు ప్రతిభావంతులైన స్పిన్నర్లు ఆ జట్టులో ఉన్నారు.
Also Read: Road Accident: బీఎండబ్ల్యూ బీభత్సం.. గాల్లోకి ఎగిరిపడ్డ ఇద్దరు యువతులు!
పేస్ బౌలర్లు తస్కిన్ అహ్మద్, నహిద్ రాణా మంచి ఫామ్‌లో ఉన్నారు. బ్యాటింగ్‌లో ముష్ఫికర్ రహీమ్, లిటన్ దాస్ కీలకం. పాక్‌పై ఈ ఇద్దరు సెంచరీలతో చెలరేగారు. కెప్టెన్ నజ్ముల్ శాంటో సైతం ఫామ్‌లో ఉన్నాడు. బ్యాటింగ్‌లో ఆల్‌రౌండర్‌లు షకిబ్, మెహిదీ కూడా కీలక పాత్ర పోషించగలరు. ప్రస్తుతం అన్ని విభాగాల్లో బంగ్లా పటిష్టంగా ఉన్న బంగ్లాను తక్కువ అంచనా వేస్తే భారీ మూల్యం తప్పదు.
తాజావార్తలు
-
Ameesha Patel: హీరోయిన్ల స్టార్‌డమ్‌పై అమీషా సంచలన కామెంట్స్.. నిర్మాతల డబ్బుతో హంగామా ఎందుకంటూ ఫైర్!
-
Hyderabad: రూ.10 కోసం ప్రాణం తీశారు.. హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణ హత్య
-
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
-
Mohit Sharma: హార్దిక్ పాండ్యాకు సరితూగడు.. నితీష్ రెడ్డిపై అంచనాలు వద్దు!
-
Apple iPhone Users: ఆపిల్ ఐఫోన్ ఉంటే డబ్బులు.. ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు? ఎలా దరఖాస్తు చేయాలి?
ట్రెండింగ్
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!