Ravichandran Ashwin Breaks Nathan Lyon Record: చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అదరగొట్టాడు. ముందుగా బ్యాట్‌తో ఆదుకున్న యాష్.. ఆపై బంతితో తిప్పేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ (113) చేసిన అశ్విన్.. రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్స్ పడగొట్టాడు. దాంతో టెస్ట్‌లో పలు రికార్డులు బద్ధలు కొట్టాడు. ఇప్పటి వరకు టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్ల జాబితాలో 8వ స్థానంలో ఉన్న వెస్టిండీస్ దిగ్గజం కోట్నీ వాల్ష్‌ను…
Team India Creates History in 92 Years Test Cricket: టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్ జట్టు అరుదైన ఘనతను ఖాతాలో వేసుకుంది. 92 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారిగా భారత జట్టు ఓటముల కంటే.. ఎక్కువ విజయాలు సాధించింది. చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో ఘన విజయం సాధించడంతో టీమిండియాకు ఈ మ్యాచ్ చిరస్మరణీయంగా మారింది. అంతేకాదు అత్యధిక టెస్టు విజయాలు నమోదు చేసిన నాలుగో జట్టుగా టీమిండియా నిలవడం…
India won by 280 Runs Against Bangladesh: చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 515 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలెట్టిన బంగ్లా.. రవిచంద్రన్ అశ్విన్ మాయాజాలంకు 234 పరుగులకు ఆలౌటైంది. దీంతో రోహిత్ సేన 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో (82) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో అశ్విన్ 6 వికెట్స్ పడగొట్టగా.. రవీంద్ర…
Jasprit Bumrah Record: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాదిలో అంతర్జాతీయ క్రికెట్ (మూడు ఫార్మాట్స్)లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డులకెక్కాడు. చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా ఓపెనర్ జకీర్ హసన్‌ను ఔట్ చేసిన బుమ్రా.. ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. 2024లో ఇప్పటివరకు 14 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన బుమ్రా ఏకంగా 47 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు…
చెన్నైలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్ స్కోరు 6 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది. కాగా.. హోంగ్రౌండ్‌లో అశ్విన్ సెంచరీతో చెలరేగాడు. 108 బంతుల్లో శతకం సాధించాడు.
అందరూ ఊహించినట్లుగానే జరుగుతోంది. ఇటీవల పాకిస్థాన్‌ను దాని సొంతగడ్డపై చిత్తు చేసిన బంగ్లాదేశ్.. అదే ఊపులో భారత్‌నూ దెబ్బ కొడుతోంది. భారత టాప్ ఆర్డర్‌కు బంగ్లా పేసర్ హసన్ మహ్మద్ చుక్కలు చూపించాడు. హసన్ దెబ్బకు స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ (6), శుభ్‌మన్ గిల్ (0), విరాట్ కోహ్లీ (6) త్వక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరారు. ఆ సమయంలో రిషబ్ పంత్ (39)తో కలిసి యశస్వి జైస్వాల్ (56) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు…
Hasan Mahmud Record Against India: చెన్నైలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. బంగ్లా యువ బౌలర్ హసన్ మహ్మద్ దెబ్బకు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరారు. 9.2 ఓవర్లలో 34 పరుగులకే టీమిండియా మూడు కీలక వికెట్స్ కోల్పోయింది. పది ఓవర్లలోపే ముగ్గురు భారత స్టార్ బ్యాటర్లు పెవిలియన్‌కు పంపిన హసన్ మహ్మద్.. అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నాడు. 17 ఏళ్ల…
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా మరికొద్దిసేపట్లో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో తొలి టెస్టు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ నజ్ముల్ శాంటో బౌలింగ్ ఎంఛుకున్నాడు. పిచ్‌పై తేమ ఉందని, దానిని ఉపయోగించాలనుకుంటున్నామని చెప్పాడు. ముగ్గురు స్పిన్నర్లతో బంగ్లా బరిలోకి దిగుతోందని శాంటో తెలిపాడు. తాము కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. ముగ్గురు పేసర్లతో బరిలోకి…
Rishabh Pant Set To Play Test Cricket: మరికొద్ది గంటల్లో భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్టుకు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదిక. ఆరు నెలల తర్వాత టీమిండియా టెస్ట్ మ్యాచ్ ఆడబోతోంది. మరోవైపు భారత జట్టు రెగ్యులర్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ 632 రోజుల తర్వాత టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు సిద్దమయ్యాడు. ఇంత విరామం ఫామ్ లేమి వల్లనో లేదా గాయం…
Rohit Sharma About Take U-Turns on Retirements: ఇటీవలి కాలంలో అంతర్జాతీయ క్రికెట్‌లో రిటైర్మెంట్ ఇవ్వడం.. ఆపై యూటర్న్ తీసుకోవడం సాధారణమైపోయింది. వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో, ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, పాకిస్తాన్ సీనియర్ పేసర్ మహ్మద్ అమీర్‌లు రిటైర్మెంట్ ఇచ్చి.. మళ్లీ జాతీయ జట్టుకు ఆడిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ కూడా మరలా జట్టు తరఫున ఆడేందుకు ప్రయత్నాలు చేశాడు. మరికొందరు ప్లేయర్స్ కూడా రిటైర్మెంట్‌పై…