IND vs BAN: అందులో తప్పేముంది.. ప్రతి రోజూ ఆ అవకాశం రాదు: సన్నీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunil Gavaskar React on Virat Kohli’s Controversal Century: బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (97 బంతుల్లో 103 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్బుత సెంచరీ చేసిన విషయం తెలిసిందే. విరాట్ సెంచరీ చేసినా.. విమర్శలను ఎదుర్కోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సెంచరీ చేసేందుకే స్ట్రయిక్ రొటేట్ చేయకుండా స్వార్ధంగా ఆడాడని, విరాట్ సెంచరీకి అంపైర్ రిచర్డ్ కెటిల్‌బొరో వైడ్ ఇవ్వకుండా కూడా సహకరించాడని నెటిజన్స్ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఈ విమర్శలపై భారత మాజీ క్రికెటర్స్ సునీల్ గవాస్కర్, క్రిష్ణమాచారి శ్రీకాంత్ స్పందించారు.
ప్రతి రోజూ సెంచరీ చేసే అవకాశం రాదని, విరాట్ కోహ్లీ చేసిన దాంట్లో తప్పేముంది? అని సునీల్ గవాస్కర్ ప్రశ్నించాడు. ‘విరాట్ కోహ్లీ 70-80 స్కోరు వద్ద ఉన్నప్పుడు సెంచరీ చేసేందుకు అవకాశం ఉందని గ్రహించాడు. ఆ అవకాశాన్ని అతడు వదులుకోకూడదని భావించాడు. కేఎల్ రాహుల్ కూడా ప్రోత్సహించాడు. అందులో తప్పేముంది?. ఏ ఆటగాడికైనా ప్రతి రోజూ సెంచరీ చేసే అవకాశం రాదు’ అని సన్నీ అన్నాడు. కోహ్లీ 74 పరుగులతో ఉన్నప్పుడు భారత్ విజయానికి 27 పరుగులు అవసరం. ఆ తర్వాత కేఎల్ రాహుల్ ఒక్క బంతి మాత్రమే ఆడాడు. మరోవైపు విరాట్ 97 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉండగా.. బంగ్లా బౌలర్ నసుమ్ అహ్మద్ లైగ్ సైడ్ దిశగా వైడ్ బాల్ వేశాడు. దాన్ని అంపైర్ రిచర్డ్ కెటిల్‌బొరో వైడ్ ఇవ్వలేదు.
Also Read
- AP Heavy Rains: వర్ష బీభత్సం.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం.. కొన్ని రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
- 150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
- Flash Flood Alerts: ఏపీ, తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఈ జిల్లాలకు ముప్పు..!
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
Also Read: Umpire Richard Kettleborough: విరాట్ కోహ్లీ సెంచరీకి కారణం అంపైర్.. అతడికి మెడల్ ఇవ్వాలి!
‘క్రికెట్‌ను అర్థం చేసుకోని (క్రికెట్ పరిజ్ఞానం లేని) వ్యక్తులను నేను ప్రశ్నిస్తున్నా.. విరాట్ కోహ్లీ చేసిన దాంట్లో తప్పేముంది. ప్రపంచకప్‌లో సెంచరీ చేయడం మాములు విషయం కాదు. సెంచరీ చేసేందుకు కోహ్లీ అర్హుడు. టీమ్ మ్యాన్ కేఎల్ రాహుల్‌కి ధన్యవాదాలు. చెన్నైలో ఆస్ట్రేలియాపై రాహుల్ అద్భుతంగా ఆడాడు. భారత్, బంగ్లా మ్యాచ్ ఆనందించండి’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ పేర్కొన్నారు.
What is wrong in what virat did? I question ppl who don’t understand cricket,note it is a huge deal to score A century in a world cup,@imVkohli deserves this & much more! kudos to a team man like @klrahul who deserved it against Aus in Chennai ! Enjoy when u still can #INDvsBAN
— Kris Srikkanth (@KrisSrikkanth) October 19, 2023
తాజావార్తలు
-
Nissan Pixo: నిస్సాన్ పిక్సో విడుదల.. 259KM రేంజ్, 10-అంగుళాల డిస్‌ప్లే, Gemini వాయిస్ అసిస్టెంట్.. ఫీచర్లు ఇవే
-
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు? విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలివే!
-
Mental Illness: 20ఏళ్ల ఆయుష్షు తగ్గుతుంది!
-
Karthik Subbaraj : స్టార్స్‌ని పక్కన పెట్టి రైజింగ్ హీరోలతో ఆడియన్స్ టెస్ట్‌కు రెడీ అయిన కార్తీక్ సుబ్బరాజ్
-
UP Crime News: యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్
ట్రెండింగ్
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్‌ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!