Rohit Sharma: బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు.. రోహిత్ శర్మ సంచలన నిర్ణయం!
- బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు
- రోహిత్ సంచలన నిర్ణయం
- ఇది రెండోసారి మాత్రమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma Selected Field after 9 Years in Tests in India: కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా భారత గడ్డపై జరిగే మ్యాచుల్లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్లు బౌలింగ్‌ను తీసుకోవడం చాలా అరుదు. కానీ రోహిత్ మాత్రం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. చివరిసారిగా 2015లో అప్పటి సారథి విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికాపై ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది.
స్వదేశంలో టెస్ట్ మ్యాచ్‌లలో భారత కెప్టెన్లు టాస్ గెలిస్తే.. ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంటారు. భారత్‌లోని పరిస్థితులే ఇందుకు కారణం. తొలి ఇన్నింగ్స్‌లో ఎక్కువగా పరుగులు చేసి.. పర్యాటక జట్టుపై ఒత్తిడిని తెస్తారు. అంతేకాదు మూడో రోజు నుంచి బంతి ఎక్కువగా టర్న్ అవుతుందని తొలుత బ్యాటింగ్ ఎంచుకుంటారు. భారత్‌లో నాలుగో ఇన్నింగ్స్ అత్యంత ప్రమాదకరం. ఛేదన చాలా కష్టం. గణాంకాలు కూడా ఇదే చెబుతాయి. అందుకే టాస్ గెలవగానే మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకుంటారు. కానీ రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకుని అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు.
Also Read
Also Read: IPL 2025: రిటైర్మెంట్ ప్రకటించిన గంటల్లోనే మెంటార్‌గా బాధ్యతలు.. గంభీర్ పోస్ట్ కొట్టేశాడు!
కాన్పూర్‌లో 24 టెస్టులు జరగగా.. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకోవడం ఇది రెండోసారి మాత్రమే. 1964లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో అప్పటి కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది. సాధారణంగా కాన్పూర్ పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉంటుంది. అయితే గురువారం రాత్రి వర్షం పడటం, నేడు వాతావరణం మేఘావృతమై ఉండటంతో రోహిత్ శర్మ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. వర్షం కారణంగా మైదానం తడిగా ఉండటతో ఆ పరిస్థితులను ఉపయోగించుకొనేందుకు ఈ నిర్ణయం తీసుకొని ఉంటాడని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..