IND vs BAN 1st Test Free Straming on JioCinema: భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య సెప్టెంబర్ 19 నుంచి రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆరంభం కానుంది. గురువారం చెన్నైలోని చెపాక్ మైదానంలో మొదటి టెస్ట్ మొదలవుతుంది. టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్‌ను దాని సొంతగడ్డపై చిత్తు చేసిన బంగ్లా.. అదే ఊపులో భారత్‌నూ దెబ్బ కొట్టాలని చూస్తోంది. దాదాపు ఆరు నెలల తర్వాత టెస్టు మ్యాచ్ ఆడుతున్న రోహిత్ సేన.. విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఈ టెస్ట్ సిరీస్ హాట్‌స్టార్‌లో రాదు. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే?.
Also Read: IND vs BAN: బెంచ్‌కే ముగ్గురు స్టార్స్.. తొలి టెస్ట్ ఆడే భారత జట్టు ఇదే!
భారత్, బంగ్లాదేశ్ రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌కు రిలయన్స్ సంస్థకు చెందిన జియోసినిమా, స్పోర్ట్స్ 18లు అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తున్నాయి. స్పోర్ట్స్ 18 ఛానెల్‌లో ఈ సిరీస్ మ్యాచ్‌లను చూడొచ్చు. అయితే ఈ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే.. డబ్బులు చెల్లించాల్సిందే. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జియోసినిమాలో మాత్రం ఈ సిరీస్‌ను ఫ్రీగా చూడొచ్చు. సెప్టెంబర్ 19న మొదటి టెస్ట్ ఆరంభం కానుండగా.. సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ వేదికగా రెండో టెస్ట్ మొదలవుతుంది. చెన్నైలో రేపు ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.