బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా గురించి పరిచయం అక్కర్లేదు. ‘దబాంగ్’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది మొదటి చిత్రంతోనే తన నటన అందంతో మంచి ఫేమ్ సంపాదించుకుంది. తర్వాత కమర్షియల్ దూరంగా ఉంటూ అఖిరా, లుటేరా, ఫోర్స్ 2 లాంటి చిత్రాల్లో పెర్ఫార్మెన్స్ రోల్స్‌ను ఎంచుకుంది. కానీ అవి ఆమె కెరీర్ కి అంతగా ప్లేస్ అవ్వలేదు. ఇక సీని జీవితం గురించి పక్కన పెడితే సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్‌ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి బాగా వార్తల్లో నిలుస్తోంది.
Also Read: Harshavardhan: ‘స్పిరిట్’ కోసం కసిగా పనిచేస్తున్నాను
ఆరేడు సంవత్సరాలు కలిసి ఉండి, డేటింగ్ చేశాక, తన తండ్రికి కూడా చెప్పకుండా జహీర్ ఇక్బాల్ ముస్లిం పెళ్లి చేసుకుంది సోనాక్షి. దీంతో ఆమె గురించి అప్పటి నుంచి సోషల్ మీడియాలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ అమ్మడు నోరుజారి మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నటి స్విమ్ సూట్ వేసుకోవడం గురించి మాట్లాడుతూ..
‘ఇండియాలో నేను బికినీ వేసుకోను. దేశం బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే బికినీ వేసుకుంటాను.ఎందుకంటే ఇక్కడ ఎవరు ఎక్కడి నుంచి ఫోటో తీస్తారో చెప్పలేం. అందుకే ఇండియా వదిలి వేరే దేశాని వెళ్ళినప్పుడు మాత్రమే బికినీ వేసుకుని స్విమ్మింగ్ చేస్తాను’ అని తెలిపింది. దీంతో ఈ అమ్మడు మాటలు సోషల్ మీడియాలో ఒక్కసారిగా దుమారం రేపుతున్నాయి. నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు.. ‘ఇండియాలో బికినీ వేసుకోకపోతే, బికినీ వేసుకున్న ఫోటోలు ఎందుకు షేర్ చేస్తున్నావు’ అని ప్రశ్నిస్తున్నారు.