బ్యాంక్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నవారికి గుడ్ న్యూస్. బ్యాంక్ జాబ్ సాధించాలనుకునే మీ కలను నెరవేర్చుకునే ఛాన్స్ వచ్చింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నిరుద్యోగులకు తీపికబురును అందించింది. ఐఓబీ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 750 పోస్టులను భర్తీచేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 25, తెలంగాణలో 31 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైతే మంచి జీతం అందుకోవచ్చు. డిగ్రీ పాసై ఖాళీగా ఉన్నవారు ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి.
Also Read:RACE : రేస్ 4లోకి ఎంట్రీ ఇస్తోన్న మాజీ టాలీవుడ్ బ్యూటీ.?
ఈ పోస్టులకు అభ్యర్థులు గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుంచి డిగ్రీ పాసై ఉండాలి. అభ్యర్థుల వయసు 20-28 ఏళ్లు కలిగి ఉండాలి. ఈ పోస్టులకు ఆన్‌లైన్ టెస్ట్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు మెట్రో ప్రాంతాల్లో రూ.15 వేలు, అర్బన్ ప్రాంతంలో రూ.12 వేలు, సెమీ-అర్బన్/ రూరల్ ప్రాంతంలో రూ.10 వేల జీతం అందిస్తారు.
Also Read:MK.Stalin: ఎంపీ స్థానాలు పెరగాలంటే త్వరత్వరగా పిల్లల్ని కనండి.. సీఎం స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
దరఖాస్తు ఫీజు జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.800 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ మహిళా అభ్యర్థులు రూ.600. దివ్యాంగులకు రూ.400గా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు మార్చి 9వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి. దరఖాస్తుకు ఇంకొ కొన్ని రోజులే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ పోస్టులకు ఇప్పుడే అప్లై చేసుకోండి.